
ఈ69న్యూస్ జనగామ:-జనగామ పట్టణంలోని అంబేద్కర్ నగర్లో గుగులోతు లక్ష్మీ దశదిన కార్యక్రమం సందర్భంగా బంజారా జాతి ప్రముఖ నాయకులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా గుగులోతు శ్రీను నాయక్,గుగులోతు అశోక్ నాయక్,వాంకుడొతు అనిత కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ లక్ష్మీ పరమపదించగా,జాతి పెద్దలు వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.మానవీయతకు ప్రతీకగా నిలిచిన ఈ కార్యక్రమంలో బంజారా సంఘం ఐక్యతను చాటిచెప్పింది.ఈ కార్యక్రమంలో మూడ్ లక్ష్మణ్,డాక్టర్ శంకర్,లయన్ రవి,భూక్యా వాసు,గుగులోతు భాస్కర్,లాకావత్ నరేష్,కొర్ర రాజేందర్,భూక్యా చందు,గుగులోతు లచిరామ్ తదితరులు పాల్గొన్నారు.