
గువ్వలగూడెంలో పోషణ పఖ్వాడా, ఈసీసీఈ డే నిర్వహణ
ఈ69న్యూస్:-జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలంలోని గువ్వలగూడెం గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో పోషణ పఖ్వాడా మరియు ఈసీసీఈ డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ అనిత ముఖ్య అతిథిగా పాల్గొని తల్లులకు చిరుధాన్యాల ప్రాముఖ్యత,పండ్లు,కూరగాయలలో ఉండే పోషకాలు గురించి వివరించారు.చిన్నారులకు కథలు వినిపించి,ఆటలు ఆడించటం ద్వారా వారి లోకజ్ఞానం పెంచే కార్యక్రమాలు నిర్వహించారు.అనంతరం పిల్లలకు అసెస్మెంట్ కార్డులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్,అంగన్వాడి టీచర్ జరీనా బేగం,ఆయా కవిత,ఆశా వర్కర్ భాగ్యలక్ష్మి, గ్రామస్థులు,తల్లులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.