గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి కృషి
జనగామ జిల్లా తరిగొప్పుల మండలం బొంతగట్టు నాగారం గ్రామంలో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని గ్రామ సర్పంచ్ కొర్రె మల్లయ్య యాదవ్ తెలిపారు.గ్రామ ప్రజల సేవ చేయాలనే ఉద్దేశంతోనే తాను సర్పంచ్‌గా పోటీ చేసి,గ్రామస్తుల ఆశీర్వాదంతో విజయం సాధించినట్లు చెప్పారు.గ్రామంలో డ్రైనేజీ,సీసీ రోడ్ల సమస్యలు ఉన్నప్పటికీ వాటిని దశలవారీగా పరిష్కరించి నిర్మాణాలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.గతంలో గ్రామపంచాయతీ కార్యాలయం పూర్తి స్థాయిలో పూర్తికాకపోగా,తాను బాధ్యతలు చేపట్టిన అనంతరం స్వంత నిధులతో పెయింటింగ్ చేయించి,సుమారు రూ.70 వేల విలువైన ఫర్నిచర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.విద్యార్థులు,యువతకు ఉపయోగపడే విధంగా గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.అన్ని రాజకీయ పార్టీల వారిని సమన్వయం చేసుకుంటూ,గ్రామస్తుల సహకారంతో గ్రామాభివృద్ధికి నిరంతరం శ్రమిస్తానని హామీ ఇచ్చారు.తాను బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెలిచినప్పటికీ,గ్రామ అభివృద్ధి లక్ష్యంగా అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు,మంత్రులు,అలాగే బిఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సహకారంతో అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు.గ్రామ సేవకు తాను పూర్తిగా అంకితమని సర్పంచ్ కొర్రె మల్లయ్య యాదవ్ స్పష్టం చేశారు