గ్రామ అభివృద్దే తన ప్రధాన లక్ష్యం
తరగని ఆదరణ.. కాంగ్రెస్ కు జై కొట్టిన ఓటర్లు..
రాంపురం సర్పంచ్ పెండ్లి శ్రీనివాస్ రెడ్డి గ్రామపంచాయతీ మూడో విడత పోలింగ్ లో కాంగ్రెస్ పార్టీ కి ఏమాత్రం ఆదరణ తగ్గలేదు, రాంపురం గ్రామపంచాయతీ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెండ్లి శ్రీనివాస్ రెడ్డి 298 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు.మొత్తం 10 వార్డులలో 5 వార్డు లు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు,4 వార్డులు బిఆర్ స్, 1 ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు,గురువారం తెలుగు గళం దినపత్రిక తో ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రజలు తనపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించారని,ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుని తప్పకుండా గ్రామ ప్రజలకు ఇచ్చిన ప్రతి హమీని మా పార్టీ అదినేతలు ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్ర నాయక్ ఆశీస్సుల తో,మండల పార్టీ అధ్యక్షులు పెండ్లి రఘువీర్ రెడ్డి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు.గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, పాఠశాల, గ్రామానికి ప్రధాన సమస్య గా ఉన్న నాగారం టూ రాంపురం వరకు రోడ్డు సరిగ్గా లేక రెండు గ్రామాల ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, స్థానిక ఏమ్మెల్యే ఆశీస్సులు తో వీలు అయినంత తొందరగా సింగిల్ లైన్ గా ఉన్న రోడ్డును,డబుల్ లైన్ రోడ్డుగా మారుస్తామన్నారు,గ్రామంలో నీ ఉపాధి అవకాశాల కల్పన వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాలు గ్రామం లోని అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా పారదర్శకంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు.తన గెలుపు కొరకు కృషిచేసిన ప్రతి కార్యకర్తకు తనకు ఓటు వేసి గెలిపించిన నా రాంపురం గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.