గ్రోమోర్ సెంటర్ వారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు
గ్రామీణ మహిళల్లో దాగి ఉన్న కళాత్మక ప్రతిభను వెలికి తీసి,సంప్రదాయ సంస్కృతిని ప్రోత్సహించే ఉద్దేశంతో ఉమ్మడి రేగొండ మండలం కొత్తపల్లి గ్రామంలో గ్రోమోర్ సెంటర్ రేగొండ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని గ్రోమోర్ సెంటర్ మేనేజర్ తౌటి అన్వేష్ నేతృత్వంలో,సిబ్బంది నాగేల్లి తిరుపతి,నిమ్మల సందీప్ సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు.ముగ్గుల పోటీల్లో గ్రామానికి చెందిన మహిళలు ఉత్సాహంగా పాల్గొని,రంగురంగుల ముగ్గులతో తమ ప్రతిభను ప్రదర్శించారు.సంప్రదాయ విలువలు, సామాజిక సందేశాలు ప్రతిబింబించే విధంగా రూపొందించిన ముగ్గులు అందరినీ ఆకట్టుకున్నాయి.పోటీల అనంతరం విజేతలకు జ్ఞాపికలు,బహుమతులు అందజేసి నిర్వాహకులు అభినందించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలు మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని సాంస్కృతిక సంపదను కాపాడటానికి దోహదపడతాయని తెలిపారు.భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని వెల్లడించారు.కార్యక్రమంలో గ్రామ పెద్దలు,మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.