
ఈ69 న్యూస్ జనగామ/స్టేషన్ ఘనపూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్
రెవెన్యూ డివిజనల్ అధికారి డి.యస్.వెంకన్న ఆధ్వర్యంలో ఈ రోజు ఆచార్య కొత్తపెల్లి జయశంకర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పిస్తూ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని అన్ని మండలాల తహసీల్దార్లు,నాయబ్ తహసీల్దార్లు పాల్గొన్నారు.స్థానిక తహసీల్దార్ వెంకటేశ్వర్లుతో పాటు తహసీల్దార్లు నాగేశ్వర్ రావు,విజయ్ కుమార్,రాజేష్ రెడ్డి,చంద్రమోహన్,అలాగే నాయబ్ తహసీల్దార్లు వేణు కుమార్,సదానందం,సంధ్యారాణి,పద్మజ పాల్గొన్నారు.అలాగే కార్యాలయ సిబ్బందిలో డిప్యూటీ స్టాటిస్టికల్ అధికారి శ్రీనివాస్ రెడ్డి, డి.టి.సునంద,సీనియర్ సహాయకులు డి.ఉపేందర్,శ్రీనివాస్,శ్రీప్రియ,సుష్మ,జూనియర్ సహాయకులు వంశీకృష్ణ,వినోద్,శ్రీను,వినయ్,సృజన్ కుమార్,బంగారి,శ్రీనివాస్,సునీల్,సంతోష్,టైపిస్టు ఎల్లయ్య,రికార్డు అసిస్టెంట్ వి.వెంకటేశ్వర్లు,నజీర్,నర్సింగం,సువార్త తదితరులు పాల్గొన్నారు.జయశంకర్ సార్ తెలుగు ప్రజల కోసం చేసిన సేవలను స్మరిస్తూ ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా అధికారులు ఆకాంక్షించారు.