చెంచుపల్లి గ్రామంలో మెడికల్ క్యాంపు నిర్వహణ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉమ్మడి రేగొండ మండల కేంద్రంలోని మెడికల్ ఆఫీసర్ హిమబిందు ఆధ్వర్యంలో చెంచుపల్లి గ్రామంలో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించి వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు.ఎప్పుడు కాచి చల్లార్చిన నీటినే ఉపయోగించాలిని,వేడి వేడి పదార్థాలు తినాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని డాక్టర్లు గ్రామస్తులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్యాధికారి హిమబిందు,పంచాయితీ కార్యదర్శి నరేష్,ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు