
E69 న్యూస్ జనగామ
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్, జిల్లా ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
రేపు (జూన్ 2) జరగనున్న కార్యక్రమాల షెడ్యూల్’:
🔹 ఉదయం 9:45కి, జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ముఖ్య అతిథి ఆలేరు ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తెలంగాణ అమరవీరుల స్థూపానికి పూలమాలవేసి నివాళులు అర్పిస్తారు.
🔹 10:00 – 10:10: జాతీయ జెండా ఆవిష్కరణ, పోలీస్ గౌరవ వందనం.
🔹 10:10 – 10:30: జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ముఖ్య అతిథి ప్రసంగం.
🔹 10:30 – 10:45: పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు.
🔹 10:45 – 10:55: విద్యార్థులకు బహుమతుల ప్రదానం.
🔹 10:55 – 11:00: ప్రభుత్వ అభివృద్ధి పథకాలపై ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శన.అనంతరం,అధికారులు,మీడియా ప్రతినిధులకు హైటీ ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ తెలిపారు.అధికారులు,మీడియా ప్రతినిధులు తప్పనిసరిగా పాల్గొని వేడుకను విజయవంతం చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కోరారు.