
ఈ69న్యూస్ జనగామ,ఆగస్టు 12
జనగామ జిల్లా వ్యాప్తంగా మంగళవారం విస్తారంగా వర్షాలు కురిశాయి.మాన్యువల్ రైన్ గేజ్ ల ఆధారంగా నమోదు చేసిన వర్షపాతం ప్రకారం,జిల్లాలో గరిష్టంగా కొడకండ్ల మండలంలో 126.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.అలాగే జాఫర్ఘడ్ మండలంలో 93.6 మి.మీ.,దేవరుప్పుల మండలంలో 64.2 మి.మీ.,పాలకుర్తి మండలంలో 62.8 మి.మీ.వర్షపాతం నమోదైంది.తక్కువ వర్షపాతం తరిగొప్పుల మండలంలో 25.0 మి.మీ.,బచ్చన్నపేటలో 27.2 మి.మీ.,ఘనపూర్ స్టేషన్ లో 28.4 మి.మీ.గా నమోదైంది.మొత్తం జిల్లాలో మంగళవారం 626.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా,జిల్లా సగటు 52.2 మిల్లీమీటర్లు గా ఉందని అధికారులు తెలిపారు.వర్షాల కారణంగా పంటలకు మేలు కలిగే అవకాశం ఉన్నప్పటికీ,తక్కువ ఎత్తు ప్రాంతాల్లో నీటిమునిగే ప్రమాదం ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.