జాతర విషయంలో రాజకీయమా?
కట్ర్యాల మల్లికార్జున స్వామి జాతర విషయంలో గ్రామ మహిళా సర్పంచ్&ప్రజల తీర్మానం కాదని రాజకీయం చేస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకులపై గ్రామస్తుల ఫైర్
•మల్లిఖార్జున స్వామి జాతర జరగనియ్యకుండా చేస్తామంటూ కాంగ్రెస్ నాయకులు బెదిరింపులు చేస్తున్నారంటూ మీడియాను ఆశ్రయించిన కట్ర్యాల గ్రామస్తులు వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామంలో ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరిగే శ్రీ మల్లికార్జున స్వామి ఉత్సవాలను జరుగకుండా కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేస్తూ ఎమ్మెల్యే నాగరాజు పేరు చెప్తూ అభివృద్ధి లో సహకారం చెయ్యం అంటూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కట్ర్యాల గ్రామ పంచాయతీ సర్పంచ్ భర్త సుల్తాన్ రాజు,గ్రామ యువకులు ఆరోపిస్తున్నారు. గ్రామ ప్రజల సమక్షంలో సర్పంచ్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్న కమిటీ ని ఇది కమిటీ కాదంటూ కాంగ్రెస్ నాయకులు లేకుండా కమిటీ వేస్తే కట్ర్యాల గ్రామంలో జాతర జరగదని,అభివృద్ధి కి సహకరించం అంటూ కాంగ్రెస్ నాయకులు బెదిరింపులు చేస్తున్నారని అన్నారు. జాతర సమయం దగ్గరపడుతుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజును మర్యాద పూర్వకంగా కలిసినప్పటికి సమస్యను పరిష్కరించడం లేదని తెలిపి మా కాంగ్రెస్ అభ్యర్థికి ఛైర్మన్ పదవి ఇచ్చి మీరు వైస్ ఛైర్మన్ గా ఉండండి అని తెలపడం గ్రామస్తులను దిక్కరించడమే అని అన్నారు.
గ్రామ నాయకులు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి సర్పంచ్ తో మాకు పని లేదు మేమే నిర్వహిస్తాం అంటూ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని, ఇప్పటికైనా జాతరను విజయవంతం చేయాలంటే గ్రామస్తులతో కలిసి రావాలని కాంగ్రెస్ నాయకులను విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే ఎండోమెంట్ లో వేస్తాం లేదా జాతరకు స్పెషల్ ఫండ్ ఇస్తాం అంటూ కల్లబొల్లి మాటలు చెప్తున్నారని ఇలాంటి వాటిని నమ్మబోమని గ్రామ యువత ముక్తకంఠం తో కండిచిన బుద్ధి రావడం లేదని అన్నారు.ఈ రోజు ఇరువర్గాలవారిని వర్ధన్నపేట పోలీస్ స్టేషన్లో కూర్చొని మాట్లాడుకుందామని పిలిపించడంతో వస్తే పోలీసుల ముందు కూడా ఇష్టానురీతిగా మాట్లాడడంతో వారుకూడా సమస్యను పరిష్కరించకుండా,లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ రాకుండా జాతర నిర్వహించాలని ఇరువురికి సూచించారు.గ్రామంలో గతంలో ఏ విధంగా అయితే జాతర సర్పంచ్ ఆద్వర్యంలో జరిగిందో అదే విధంగా గ్రామస్తులు సమక్షంలో ఎన్నుకున్న మల్లికార్జున స్వామి నూతన కమిటీతో జాతర నిర్వహిస్తామని కాంగ్రెస్ నాయకులు ఎలా అపుతారో చూస్తామని అన్నారు.