
టియుడబ్ల్యూజే హెచ్-143లోకి జోరుగా వలసలు
ఐజేయు నుండి టియుడబ్ల్యూజె -143 యూనియన్ కి శుక్రవారం మునగాల మండలంలోని జర్నలిస్టులు భారీగా చేరారు. జర్నలిస్టుల సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న ఏకైక యూనియన్ టిడబ్ల్యూజేహెచ్-143 యూనియన్ మాత్రమేనని జిల్లా ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్, టిడబ్ల్యూజేహెచ్-143 కోదాడ నియోజకవర్గ అధ్యక్షులు వంగవీటి శ్రీనివాసరావులు అన్నారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు సంఘం నుండి సభ్యత్వాన్ని రద్దు చేసుకొని, తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ టిడబ్ల్యూజే హెచ్ 143 యూనియన్ లోకి వచ్చిన సీనియర్ జర్నలిస్ట్ జి.ఎస్.రెడ్డి, జె. సామ్యూల్, బి. గోవర్ధన్, ఎస్కే దస్తగిరి, ఎస్. గోపి, అనంతుల శ్రీను, సుంకరి సతీష్, ధరావత్ రవి, గడ్డం లక్ష్మీనారాయణ, ఎస్కే పాషా, తోకల సైదులు జిల్లా ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్, వంగవీటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్ మాట్లాడుతూ, ప్రభుత్వ వారధిగా ఉంటూ నిత్యం జర్నలిస్టు సమస్యలపై, ఇండ్ల స్థలాలకై పోరాడుతున్న యూనియన్ టియూడబ్ల్యూజేహెచ్ 143 మాత్రమే అన్నారు. యూనియన్ యొక్క విధి విధానాలకి ఆకర్షితులై యూనియన్ లో సభ్యత్వం తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం నూతనంగా సభ్యత్వం తీసుకున్న జర్నలిస్టు మిత్రులకు పలువురు యూనియన్ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా టియుడబ్ల్యూజేహెచ్ 143 ప్రధాన కార్యదర్శి హరికిషన్, కోదాడ నియోజకవర్గం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పిడమర్తి గాంధీ, కోదాడ నియోజకవర్గం ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు, సీనియర్ జర్నలిస్టు పడిశాల రఘు, టీయూడబ్ల్యూజే హెచ్143 ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి మరికంటి లక్ష్మణ్, ప్రెస్ క్లబ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ తంగెళ్లపల్లి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.