
సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి అబ్బాస్
పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మిక వర్గాన్ని బలిచ్చే నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలి సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి అబ్బాస్ గారు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి జే వెంకటేష్ గారు సిఐటియు జిల్లా కార్యదర్శి శ్రావణ్ కుమార్ గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా దేశవ్యాప్త సమ్మె పిలుపులో భాగంగానే సంతోష్ నగర్ చౌరస్తా నుండి ఓవైసీ హాస్పిటల్ వరకు భారీగా ప్రదర్శన నిర్వహించి అనంతరం సభ జరిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సంస్థలను ప్రైవేటు అప్ప చెప్పవద్దు నాలుగు లేబర్ కార్డులను రద్దు చేయాలి ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలి 282 జియోని వెంటనే రద్దు చేయాలి పెరుగుతున్న ధరల కనుగుణంగా కార్మికులకు కనీస వేతనాలు పెంచాలి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి పెట్టుబడిదారులకు ఊడిగం కాస్తున్న కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను పూర్తిస్థాయిలో నశించాలి అసంఘటిత రంగ కార్మికులకి సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలి కార్మికులందరికీ సామాజిక భద్రతను ఏర్పాటు చేయాలి నాలుగు లేబర్ కోడ్స్ అమలవడం వల్ల కార్మికులందరికీ సంఘం పెట్టుకున్న స్వేచ్ఛ ఉండదు. జీతం పెంచమని అడిగే హక్కు ఉండదు ఉద్యోగ భద్రత ఉండదు. సంఘాలని లేకుండా రద్దు చేస్తారు స్వేచ్ఛ అనేది ఉండదు సెలవులు ఉండయి ఉపాధి అవకాశాలు ఉంటాయి కావున కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు రాష్ట్ర ప్రభుత్వం కూడా యధావిధిగా అమలు చేస్తున్నది కార్మికుల శ్రమని దోచుకుంటూ జలగల్లాగా రక్తాన్ని పీడిస్తున్న పరిస్థితి ఉంది అదనంగా పనిచేయించుకున్న వాటికి తగ్గట్టుగా ఓటీలు కట్టించటం లేదు పని గంటలు పెంచి కార్మికుల రక్తాన్ని పీల్చే విధంగా కొత్త చట్టాలని తెస్తున్నారు కావున దేశవ్యాప్తంగా సమ్మె విజయవంతంగా నిర్వహించటం జరిగింది
కార్యక్రమంలో పాల్గొన్న వారు సిఐటియు జిల్లా అధ్యక్షురాలు మీనా కిషన్ కోటయ్య బాబర్ఖాన్ యాకూబ్ ఐద్వా నాయకులు శశికళ లక్ష్మమ్మ గిరిజన సంఘం నాయకులు బాలునాయక్ అవాజ్ నాయకులు అబ్దుల్ సత్తార్ అబ్దుల్లాదీప్ నాయకులు కృష్ణనాయకు తదితరులు పాల్గొన్నారు