
2024 CALNDERS NEWS
ఆవిష్కరించిన రంగారెడ్డి జోన్ జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ శ్రీ చతుర్వేది.
నందిగామ మండలం మెకగూడ గ్రామంలో గల నాట్కో ఫార్మా లిమిటెడ్ పరిశ్రమ ఎంప్లాయీస్ అసోసియేషన్ ముద్రించిన 2024 నూతన సంవత్సర కేలండర్ ను ఈ రోజు హైదరాబాద్ టంగుటూరి అంజయ్య కార్మిక సంక్షేమ భవన్ లో రంగారెడ్డి జోన్ జాయింట్ కమిషనర్ చతుర్వేది కేలండర్ ను ఆవిష్కరించారు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం, చట్టాల అమలు, సమస్యల పరిష్కారం కోసమే కార్మిక శాఖ పనిచేస్తుందని, యాజమాన్యం తో ఏ సమస్య ఉన్నా సామరస్యంగా శాంతియుత వాతావరణంలో పరిష్కరించుకోవాలని, ఎవరూ కూడా పారిశ్రామిక శాంతి కి భంగం కలిగే విధంగా ప్రవర్తించ రాదని కోరారు. ఏదైనా సమస్య ఉంటే అధికారుల దృష్టికి తీసుకు వచ్చి పరిష్కరించుకోవాలని సూసించారు…
ఈ కార్యక్రమంలో కార్మిక నేత నాట్కో ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పినపాక ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి జైపాల్ రెడ్డి, కార్య నిర్వాహక అధ్యక్షుడు నాగభూషణం, ఉపాధ్యక్షుడు కిషోర్, హరికృష్ణ, కార్యదర్శులు హరికుమార్, రాజీ రెడ్డి, ఎలియ, రాంచందర్, కోశాదికారి పిచ్చయ్య, లేబర్ అధికారులు గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.