
ఈ69న్యూస్ న్యూస్ ధర్మసాగర్
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని నారాయణగిరి గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుకున్న 1983-84 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని జరుపుకున్నారు.ఈ సమావేశంలో భాస్కర్ రెడ్డి అధ్యక్షతన కార్యవర్గ కమిటీ సభ్యులుగా వల్లపురెడ్డి నరేందర్ రెడ్డి,గడ్డం రాజయ్య,కోటిలింగం,లింగారావు,వెల్దండి రమా,జ్యోతి,కర్ర సురేందర్ రెడ్డి,వక్కల భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.పూర్వ విద్యార్థులు తమ పరిచయాలను పంచుకుంటూ,జీవితంలో సాధించిన విజయాలు,ఉపాధ్యాయులైనప్పటికీ శిష్యులపై చూపిన మమకారం,విద్యార్థిదశలో నేర్పిన విలువలు,క్రమశిక్షణ,సమయపాలన మొదలైన అంశాలను ఆనందంగా గుర్తుచేసుకున్నారు.ఈ సందర్భంగా పది మంది సహచర మిత్రులు ఇకలేరు అనే విషాద వార్తను పంచుకుని,ఇంకొన్ని సంవత్సరాల క్రితమే సమ్మేళనం జరిగి ఉంటే,వారు కూడా మనమధ్యలో ఉండేవారు”అనే భావోద్వేగం వ్యక్తం చేశారు.ఉపాధ్యాయులు రాధా కిషన్ (ప్రధానోపాధ్యాయులు),రాధాకిషన్ రావు,స్నేహలతా రెడ్డి,రమా జ్యోతి,వల్లపురెడ్డి జనార్దన్ రెడ్డి,మధుసూదన్ రావు,ఉప్పలయ్య తదితరులు హాజరై,విద్యార్థులతో స్మృతులను పంచుకున్నారు.ఉపాధ్యాయులు మాట్లాడుతూ..విద్యార్థుల క్రమశిక్షణే మా పాఠశాలకి 1989లో ఉత్తమ హైస్కూల్ అవార్డును అందేలా చేసింది”అని పేర్కొన్నారు.విద్యార్థులు అప్పటి స్కూల్ జ్ఞాపకాలను,ఆటలు,సినిమాల కోసం చెప్పిన సాకులను,ఒకరికొకరు ఇచ్చుకున్న ప్రోత్సాహాన్ని మనసారా గుర్తుచేసుకున్నారు.