
ఈ69న్యూస్ వరంగల్:- వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ IPS ఆదేశాల మేరకు,జాగృతి పోలీస్ కళాబృందం NPR కాలనీలో అవగాహన కార్యక్రమం నిర్వహించింది.యువత మత్తుపదార్థాల బారిన పడకూడదని,గంజాయి విక్రయంపై సమాచారం ఇవ్వాలంటూ 8712584473 నంబర్‌ను ప్రకటించారు.సైబర్ క్రైమ్స్,డయల్ 100, బాల్య వివాహాలు,ఈవ్ టీజింగ్ వంటి అంశాలపై పాటలు,నాటికలు,మ్యాజిక్ షో ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించారు.ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు,కళాబృంద సభ్యులు,సుమారు 200 మంది గ్రామస్తులు పాల్గొన్నారు.