ప్రధానోపాధ్యాయుడి నీచానికి గ్రామం ఉలిక్కిపాటు
ప్రధానోపాధ్యాయుడి నీచానికి గ్రామం ఉలిక్కిపాటు
తెలుగు గళం న్యూస్ వర్దన్నపేట జులై 28
విద్యార్థులకు విలువలు బోధించాల్సిన ఓ ప్రధానోపాధ్యాయుడు కామాంధుడిగా మారి నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన వరంగల్ జిల్లా వర్దన్నపేట మండలంలో తీవ్ర కలకలం రేపింది. ఈ అమానుష ఘటనతో గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పోలీసుల వివరాల ప్రకారం, వర్దన్నపేట మండలం బండోతపురం గ్రామానికి చెందిన తాటికాయల భాస్కర్ (50) జఫర్ఘడ్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఈ నెల 26వ తేదీన మధ్యాహ్నం సుమారు 2:30 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన నాలుగేళ్ల బాలిక ఆడుకుంటూ నిందితుడి ఇంట్లోకి వెళ్లింది.కొద్దిసేపటి తర్వాత బాలిక కనిపించకపోవడంతో తల్లి వెతుకుతూ నిందితుడి ఇంటికి వెళ్లగా, చిన్నారితో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఆమె ప్రైవేట్ భాగాలను తాకి అత్యాచార యత్నానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. అనంతరం చిన్నారి జరిగిన విషయాన్ని తల్లికి చెప్పడంతో కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు.ఫిర్యాదు అందుకున్న వర్దన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.అనంతరం కోర్టులో హాజరుపరచగా రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.ఈ ఘటనతో బండౌతపురం గ్రామంలో తీవ్ర ఆందోళన నెలకొంది.చిన్నారిపై దారుణానికి పాల్పడిన నిందితుడిపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.