
ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి కొత్తపల్లి గోరి
కొత్తపల్లి గోరి మండల కేంద్రంలోని నూతన పోలీస్ స్టేషన్ లో ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఎస్సై దివ్య ను ఆదివారం బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు హమీద్, టౌన్ అద్యక్షుడు రఘుశాల తిరుపతి ఆధ్వర్యంలో నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా వారు ఎస్సై ను శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. మండలంలో శాంతి భద్రతలకు అందరూ సహకరించాలని, గోరి కొత్తపల్లి మండలాన్ని ఆదర్శంగా ఉండేలా ప్రతి ఒక్కరి సహకారం ఉండాలని ఎస్సై కోరారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి దండెబోయిన సంతోష్, గండ్ర యువసేన నియోజకవర్గ ఉపాధ్యక్షుడు నిమ్మల శంకర్, గండ్ర యువసేన మండల అధ్యక్షుడు సుధనబోయిన సుమన్, మండల యూత్ ఉపాధ్యక్షుడు మహేష్, పేర్వాల వెంకటేష్, ఉడుత కుమార్, వనం శ్రీనివాస్,
శివ, నరేష్ తదితరులు పాల్గొన్నారు.