నూతన మున్సిపల్ చైర్మన్ దంపతులకు శుభాకాంక్షలు
రంజాన్ మాసం ఆరంభం సందర్భంగా అల్లాహ్ చిత్రం బహుకరించిన కుమార్ బుక్స్ అధినేత
ఈ నెల 11 న జరిగిన పురపోరులో సత్తుపల్లి పట్టణ మున్సిపల్ చైర్మన్ గా పట్టణానికి చెందిన ఆటో కన్సల్టెన్సీ వ్యాపారి,మట్టా దయానంద్ అనుచరుడు కమాల్ పాషా సతీమణి రెహానా బేగం కౌన్సిలర్ గా గెలిచి ఈ నెల16 న చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం పాఠకులకు విదితమే.ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పట్టణంలో సుమారుగా 30 ఏళ్లుగా బుక్స్& స్పోర్ట్స్ వ్యాపారంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కుమార్ బుక్స్ అధినేత మల్లూరు సూర్యనారాయణ చైర్మన్ రెహానా బేగం కమాల్ పాషా దంపతులను వారి స్వగృహంలో కలిసి శుభాకాంక్షలు తెలిపి పట్టణ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని అభివృద్ధి చేయడంలో అంబాసిడర్ లా దూసుకెళ్ళాలని ఆకాంక్షించారు.అనంతరం రంజాన్ మాసం ఆరంభం అయిన సందర్భంగా వారికి అల్లాహ్ చిత్రంతో కూడిన కేలండర్ ను మల్లూరు బహుకరించారు.ముందుగా సతీ పతులకు మల్లూరు విఐపి కండువా కప్పి సత్కరించారు. సూర్యనారాయణకు కమాల్ పాషా దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.