పసి ప్రాణం తీసిన పెన్సిల్
ఆడుకుంటుండగా దుర్ఘటన-యుకేజీ బాలుడు మృతి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని నాయకన్ గూడెం గ్రామంలో హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది.స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో యుకేజీ చదువుతున్న విహార్(6)అనే బాలుడు ప్రమాదవశాత్తు మృతిచెందాడు.పాఠశాల విరామ సమయంలో విహార్ ముత్రశాలకు వెళ్లి తిరిగి తరగతి గదికి పరిగెడుతూ వస్తుండగా అకస్మాత్తుగా కిందపడిపోయాడు.ఈ సమయంలో అతని చేతిలో ఉన్న పెన్సిల్ గొంతులో గుచ్చుకుని తీవ్ర గాయాలయ్యాయి.వెంటనే ఉపాధ్యాయులు బాలుడిని ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.ఈ ఘటనతో పాఠశాల పరిసరాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.పసి వయసులోనే ప్రాణాలు కోల్పోయిన విహార్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.