ఎంసీపీఐయూ వరంగల్ నగర కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం వరంగల్లోని ఓంకార్ భవన్ జిల్లా కార్యాలయంలో నగర సహాయక కార్యదర్శి సుంచు జగదీశ్వర్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంసీపీఐయూ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ మాట్లాడుతూ..వరంగల్ నగర సమగ్ర అభివృద్ధి మాటల్లోనే ఉందని,ప్రజల అవసరాలను పట్టించుకునే తీరు పాలకుల్లో లేదని విమర్శించారు.నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఎంసీపీఐయూ పార్టీ కట్టుబడి పోరాడుతుందని తెలిపారు.ప్రస్తుతం దేశాన్ని పాలిస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కార్మిక-కర్షక వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.కార్మికులు సంవత్సరాలుగా పోరాడి సాధించిన 29 కార్మిక చట్టాలను రద్దు చేసి,వాటి బదులుగా 4 శ్రామిక నియమావళులను అమలు చేయడం వల్ల నగరంలో నివసించే కార్మిక వర్గం హక్కులు హరించబడుతున్నాయని తెలిపారు.పెద్ద వ్యాపార వర్గాలకు లాభం చేకూర్చడమే లక్ష్యంగా కార్మికులను ఆధునిక బానిసలుగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు.ఈ అన్యాయ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు,ప్రజలు ఐక్యంగా పోరాడితేనే పాలకులను వెనక్కి తగ్గించగలమని పిలుపునిచ్చారు.ప్రజా హక్కుల కోసం ఎంసీపీఐయూ నిరంతరం పోరాటం చేస్తున్నందున ప్రజలు పార్టీకి అండగా నిలవాలని కోరారు.“ఇంటింటికి ఎంసీపీఐయూ” కార్యక్రమంలో పాల్గొనే మా కార్యకర్తలకు ప్రతి కుటుంబం సహకరించాలన్నారు.ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి మాలోతు సాగర్,నగర కార్యదర్శి వర్గ సభ్యులు నర్రా ప్రతాప్,ఎగేని మల్లికార్జున్,ముక్కెర రామస్వామి,మాలోతు ప్రత్యుష,ఐతం నగేష్,నగర కమిటీ సభ్యులు గణేపాక ఓదెలు,తాటికాయల రత్నం,మాలి ప్రభాకర్,నర్సయ్య,ఐలయ్య,ఎన్ రవీందర్,బాపు రామస్వామి,మంద అనిల్,మహిళా నాయకులు విజయ,పూలమ్మ,యశోద తదితరులు పాల్గొన్నారు.