ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని పరిశీలించిన ఎమ్మెల్యే
ఖమ్మంజిల్లా సత్తుపల్లి పట్టణంలో నూతనంగా నిర్మించబడిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ దంపతులు పరిశీలించారు.అనంతరం
సత్తుపల్లి సింగరేణి వారి ఆధ్వర్యంలో సత్తుపల్లి నూతన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి కీ వైద్య పరికరాలు అందించారు.ఈ కార్యక్రమంలో ఎం ఆర్ ఒ , ఎంపీడీఓ, ప్రభుత్వ అధికారులు, సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రెహానా బేగం, వైస్ చైర్మన్ బొంతు సుమలత, ఆసుపత్రి సూపెరడెంట్ సురేష్ నాయక్, సత్తుపల్లి ఎ ఎం సి చైర్మన్ దోమ ఆనంద్, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు ,సత్తుపల్లి పట్టణ కౌన్సిలర్స్, ఆసుపత్రి డెవలప్మెంట్ కమిటీ ఐనపనూరు కుమారి, ఫయాజ్, మొరిశెట్టి సాంబశివరావు, ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్స్, మెడికల్ ఆఫీసర్స్, హాస్పిటల్ సిబ్బంది, సత్తుపల్లి కాంగ్రెస్ నాయకులు కొత్తూరు ప్రభాకర్ రావు , కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.