
ఫంక్షన్ హాల్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలి– బాధిత రమేష్ విజ్ఞప్తి
ఈ69న్యూస్:-హన్మకొండ జిల్లా అయినవోలు మండలం పంతిని గ్రామంలో ఫంక్షన్ హాల్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని భూ యజమాని రమేష్ స్థానిక తహసీల్దార్ విక్రమ్ కుమార్కు వినతి పత్రం సమర్పించారు. 322,323 సర్వే నెంబర్లకు సంబంధించిన భూ వివాదాన్ని వెంటనే పరిష్కరించాలని కోరారు.323 సర్వే నెంబర్లో లక్షల రూపాయలు ఖర్చుపెట్టి అనుమతులు తీసుకున్నప్పటికీ కొంతమంది అధికారులు ఇబ్బందులు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.ఎల్3 పర్మిషన్ కోసం అధికారులను కలిసినా సిస్టం పనిచేయడం లేదని చెప్పి మౌఖికంగా ఇచ్చిన సమాచారం ఇప్పుడు సాకుగా చూపుతూ నిర్మాణాన్ని ఆపేస్తున్నారని తెలిపారు.తన వద్ద ఉన్న ఆధారాలతో త్వరలోనే ఉన్నతాధికారులను కలవనున్నట్లు రమేష్ తెలిపారు.