
బిఆర్ఎస్ ప్రభుత్వంలో సహకార సంఘాల అభివృద్ధి
సహకార సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం కోదాడ మండలం మునగాల ప్రాథమిక వ్యవసాయ సహకార యూనియన్ ఆధ్వర్యంలో నూతనంగా వ్యవసాయ గోదాం ముఖ్యఅతిథిగా విచ్చేసి శంకుస్థాపన కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడాతూ… గత ప్రభుత్వాల హయాంలో సహకార సంఘాలు నిర్వీర్యమై ఉన్నాయన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సహకార సంఘాలను చైతన్యపరిచి అనేక రకాలుగా అభివృద్ధి చేశామన్నారు. సహకార సంఘాల ద్వారా రైతులకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలతో పాటు ఎరువులు పురుగుమందులు అందజేచేయడమే కాక రైతులు తమ పంటను నిల్వ చేసుకునేందుకు సహకార సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున లక్షల రూ.లు బడెజ్ట్ కేటాయిస్తున్నామని అన్నారు.ముఖ్య మంత్రి కేసీఆర్ కృషితో నేడు సహకార సంఘాలు రైతులకు అండగా నిలుస్తున్నా యన్నారు. సహకార సంఘాలను వాణిజ్యపరంగా కూడా అభివృద్ధి చేస్తూ తెలంగాణ రాష్ట్రం దేశంలో ఆదర్శంగా నిలుస్తుందన్నారు. రైతులు సహకార సంఘం సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే గారు సన్మానించారు.
ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అజయ్ కుమార్, సొసైటీ చైర్మన్ కందికంది సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షులు తొగర్ రమేషు, స్థానిక సర్పంచి చింతకాయలు ఉపేందర్, కోపరేటివ్ జిల్లా డైరెక్టర్ కొండ సైదయ్య, సొసైటీ చైర్మన్ సీతారాములు, టిఆర్ఎస్ నాయకులు ఎలక నరేందర్ రెడ్డి, గన్న నరసింహారావు, లింగారెడ్డి, వీరమ్మ, మాజీ జెడ్పిటిసి కోళ్ల ఉపేందర్, సత్యనారాయణ రెడ్డి, చెన్నారెడ్డి, అధికారులు, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పాలకవర్గ సభ్యులు, అభిమానులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.