నేడు చలో సూర్యాపేటలొ జరిగే బిఎస్పీ జాతీయ అధ్యక్షురాలు బెహంజీ కుమారి మాయావతి సభకు బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గుగులోత్ పార్వతి రమేష్ నాయక్ ఆధ్వర్యంలో డోర్నకల్ నియోజకవర్గ బిఎస్పి శ్రేణులు భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా బిఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి గుగులోత్ పార్వతి రమేష్ నాయక్ మాట్లాడుతూ డోర్నకల్ నియోజకవర్గంలో బహుజనులకు రాజ్యాధికారం సాధించుటకు బీసీ,ఎస్సీ,ఎస్టి,మతమైనారిటీలు అగ్రకుల పేదలు ఏకమవుతున్నారని తెలిపారు.డోర్నకల్ గడ్డ బహుజనుల అడ్డా, ఏనుగు గుర్తుపై ఓటేసి నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే డోర్నకల్ లో నీలి జెండా ఎగరేసి సమగ్రంగా అభివృద్ధి చేస్తానని కోరారు.ఈకార్యక్రమంలో బిఎస్పీ జిల్లా ఇంచార్జ్ ఎల్ విజయ్ కాంత్, జిల్లా ఉపాధ్యక్షులు తగరం నాగన్న, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఐతం ఉపేందర్, జిల్లా కార్యదర్శి, డోర్నకల్ అసెంబ్లీ ఇంచార్జ్ ఐనాల పరశురాములు, జిల్లా ఇసి మెంబర్ ఎడ్ల శ్రీను, అసెంబ్లీ అధ్యక్షులు భాషిపంగు మహేందర్, అసెంబ్లీ మహిళ కన్వీనర్ జినక సువార్త,మాజీ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి తగరం శ్రీరామ్,మరిపెడ మండల అధ్యక్ష, కార్యదర్శులు జినక కృష్ణమూర్తి,గుగులోత్ భాసునాయక్, దంతాలపల్లి మండల అధ్యక్షులు ఎరుపుల పవన్, సీరోల్ మండల అధ్యక్షులు మందడి కమలాకర్, చిన్నగూడూరు మండల ప్రధానకార్యదర్శి జాగటి సునీల్, మండల మహిళ కన్వీనర్ వంగూరి స్వరూప,డోర్నకల్ మండల నాయకులు కొండ్రు అరుణ్, వివిధ మండలాల నాయకులు పోలేపాక ప్రవీణ్, గుగులోత్ రామారావు, ఎం సాయికిరణ్, జినక ప్రకాష్, చింతకుంట్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.