బ్రాహ్మణ విద్యార్థి సంఘం
తెలుగు గళం న్యూస్ హైదరాబాద్,నవంబర్ 4
బీసీ 42 శాతం రిజర్వేషన్ల సాధనకై ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల సమక్షంలో ఓయు, జెఎసి ఫౌండర్ & చైర్మన్ డా.జంపాల రాజేష్ ఆధ్వర్యంలో నవంబర్ 4 నుండి 8 వరకు రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి.ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ కొలిపాక సతీష్ నాయి పాల్గొని బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.దీక్షలో నాయి బ్రాహ్మణ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వెంకట్,ఉపాధ్యక్షుడు తిమ్మనగరం సతీష్,వర్కింగ్ ప్రెసిడెంట్ జంపాల రాంబాబు,కోడెపాక కుమారస్వామి,కొత్తపల్లి రవి,విజయగిరి సమ్మయ్య,వి.బాలరాజు,కంది సూర్యనారాయణ,గద్వాల్ బాలరాజు,డి.చక్రవర్తి,సుధాకర్,మురహరి శ్రీధర్,రాకేష్,చేర్యాల నర్సింగ్,అంబర్పేట శ్రీకాంత్ తదితరులు పాల్గొని దీక్షను విజయవంతం చేశారు.