
భూదాన్ భూముల పేరిట మోసం – ఆరుగురిపై కేసు నమోదు
ఈ69 న్యూస్ సత్తుపల్లి, మార్చి 7
ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్లలో భూదాన్ మరియు ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమించి బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసిన ఘటనపై ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు సత్తుపల్లి ఇన్స్పెక్టర్ శ్రీహరి తెలిపారు.
ఎన్కూర్ గ్రామానికి చెందిన పోనెబోయిన బేబీ, పోలెబోయిన ముత్తయ్య, కల్తి రామచంద్రయ్య, పడిగ యెర్రయ్య, షేక్ అక్తర్, కుంజా కృష్ణ అనే ఆరుగురు కలిసి వెలుగుమట్ల గ్రామంలోని సర్వే నంబర్లు 147, 148, 149లో ఉన్న ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా చూపించి బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
సత్తుపల్లి మండలం కిస్టారం గ్రామానికి చెందిన గుడిమల్ల స్పందన ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ప్రభుత్వం ద్వారా ప్రతి ప్లాట్ 100 గజాలు ఉంటాయని, జిల్లా కలెక్టర్ ద్వారా పట్టాలు ఇప్పిస్తామని నమ్మబలికి ఫోన్‌పే ద్వారా రూ.45,000 తీసుకొని మోసం చేసినట్లు వెల్లడైంది.
ఈ ఫిర్యాదు ఆధారంగా ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.