
భూ భారతి చట్టంపై రైతులకి అవగాహన కలగాలి – ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఈ69న్యూస్ జనగామ:-రైతులకు మెరుగైన సేవలు అందించడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి-2025 చట్టం ధరణికంటే ఉత్తమమైందని,ఈ చట్టం ద్వారా భూ రికార్డుల లోపాలను సరిదిద్దేందుకు అవకాశముందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలో జరిగిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా,అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్తో కలిసి పాల్గొన్న శ్రీహరి,రైతుల సందేహాలకు సమాధానం ఇచ్చారు.భూ సమస్యల పరిష్కారానికి ఆన్లైన్ మానిటరింగ్ విధానం అవసరమని,వ్యవస్థను అవినీతి రహితంగా మార్చాల్సిన అవసరం ఉందని అన్నారు.రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు రెవెన్యూ సిబ్బంది పూర్తి నిబద్ధతతో పనిచేయాలని,కలెక్టర్ చర్యలు తీసుకోవాలని సూచించారు.