
ఈ69న్యూస్:-స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని చిల్పూర్ మండల కేంద్రం వరలక్ష్మి గార్డెన్స్ లో నిర్వహించిన భూ భారతి ఆర్ఓఆర్ 2025 చట్టం అవగాహన సదస్సులో ఎమ్మెల్యే,మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా,అదనపు కలెక్టర్(రెవెన్యూ) రోహిత్ సింగ్ కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ,గత పాలనలో అమలైన ధరణి విధానంలో అనేక పొరపాట్లు జరిగాయని,వేల ఎకరాల భూములు అక్రమంగా కబ్జా చేయబడ్డాయని తెలిపారు.ధరణి ద్వారా జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లను గుర్తించి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.భూ భారతి చట్టం ద్వారా ప్రజలకు తమ భూమిపై పూర్తి సమాచారం లభించేలా నాలుగు దిక్కుల భూమి హద్దులు,సర్వే నంబర్లతో కూడిన మ్యాప్ లభిస్తుందని పేర్కొన్నారు.వివాదాస్పద ఆర్ఓఆర్ మ్యుటేషన్లపై అప్పీల్ చేసే అవకాశం ఈ చట్టం కల్పించిందని,వారం రోజుల్లో సమస్య పరిష్కారం సాధ్యమవుతుందని వివరించారు.భూ భారతి చట్టంలో ఉన్న ముఖ్యమైన అంశాలను సులభమైన భాషలో కరపత్రాల రూపంలో ప్రజలకు అందించాలని కలెక్టర్‌ను సూచించారు.గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకన్న,తహసీల్దార్,మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య రెడ్డి,చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ శ్రీధర్ రావు తదితర అధికారులు,రైతులు,నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.