మున్సిపల్ చైర్మన్ బసవేశ్వర్ మరియు వైస్ చైర్మన్ అందే మోహన్
ప్రముఖ సామాజిక వేత్త, పౌల్ట్రీ ఫెడరేషన్ నాయకులు పాతూరి వెంకటరావు ఆర్ధిక సహకారంతో విద్యా వాలంటీర్ నియామకం. మరియు బ్యాగులు, పలకలు, పుస్తకాలు అందజేత.
ముఖ్య అతిధులుగా పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ బసవేశ్వర్ మరియు వైస్ చైర్మన్ అందే మోహన్, కార్మిక, ఉపాధ్యాయ సంఘాల నాయకులు.
రంగారెడ్డి జిల్లా, షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధి 6 వ వార్డులో గల ఎంపీ శేషయ్య నగర్ పౌల్ట్రీ కాంప్లెక్స్ లో ప్రభుత్వం నిర్వహిస్తున్న “బడిబాట” కార్యక్రమాన్ని మండల విద్యా శాఖ అధికారి మనోహర్ నేతృత్వంలో , పౌల్ట్రీ రైతుల సహకారంతో నిర్వహించి, కార్మికులకు అవగాహన కల్పించారు. సుమారు 60 మంది చిన్నారులను గుర్తించి వారిని ప్రభుత్వ బడుల్లో చేయించే విధంగా కృషి చేశారు. అందులో భాగంగా సోమవారం నాడు ఎంపీ శేషయ్య నగర్ లో ఎంపీ శేషయ్య నాగరత్నమ్మ కమ్యూనిటీ హాల్ లో సుమారు 60 మంది చిన్నారులకు బ్యాగులను, పలకలను, పుస్తకాలను అందించి అందరికీ అక్షరాభ్యాసం చేయించారు… ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు బసవేశ్వర్, వైస్ ఛైర్మన్ అందే మోహన్, ప్రముఖ సామాజిక వేత్త, పౌల్ట్రీ ఫెడరేషన్ నాయకులు పాతూరి వెంకటరావు, కార్మిక నేత పినపాక ప్రభాకర్, ఉపాధ్యాయ సంఘాల నేతలు తిరుమలయ్య, నరసింలుగౌడ్ లు పాల్గొనారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మండల విద్యా శాఖ అధికారి మనోహర్ మాట్లాడుతూ… ప్రభుత్వం నిర్వహిస్తున్న బడి బాట కార్యక్రమంలో భాగంగా ఈ రోజు పౌల్ట్రీ పరిశ్రమలో పనిచేసే కార్మికుల పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని ప్రయోజులుగా తీర్చి దిద్దాలనే లక్ష్యంతో గత వారం రోజులుగా కార్మిక, ఉపాధ్యాయ సంఘాల నేతల సహకారంతో పౌల్ట్రీ రైతుల తోట్పాటుతో సుమారు 60 మంది చిన్నారులను గుర్తించినట్లు తెలిపారు. ఇంకా సుమారు 20 మంది మిగిలినట్లుగా ఉన్నారని, వారినికోడా గుర్తిస్తాము అన్నారు. అనంతరం పౌల్ట్రీ ఫెడరేషన్ నాయకులు, సామాజిక వేత్త పాతూరి వెంకటరావు గారిని కలసి అక్కడ ఉన్న పరిస్థితులను వివరించగా ఒక విద్యా వాలంటీర్ కు నిరంతరాయంగా వేతనం చెల్లిస్తామని , పిల్లలకు అన్ని రకాల సౌకర్యాలకు సహకరిస్తానని చెప్పటం సంతోషదాయకం అన్నారు. అంతే కాకుండా పిల్లలకు బ్యాగులు, పలకలు, పుస్తకాలు కూడా అందించారని తెలిపారు. ఈ కార్యక్రమానికి పూర్తిగా కార్మిక సంక్షేమ సంఘం నాయకులు పినపాక ప్రభాకర్ సహకారం మరువలేనిదని కొనియాడారు.
విద్యాభివృద్ధికి ఎప్పుడూ సహాయ సహకారాలు అందిస్తా. – పాతూరి.
పౌల్ట్రీ ఫెడరేషన్ నాయకులు, సామాజిక వేత్త పాతూరి వెంకటరావు మాట్లాడుతూ… ఇలాంటి మంచి కార్యక్రమం మా కాంప్లెక్స్ లో జరగటం సంతోష దాయకంగా ఉందని, ఈ కృషి అంతా ఎంఈవో మనోహర్ గారిదే అన్నారు. విద్య కు సంబంధించి తమ నుండి ఎల్లపుడూ సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు. ఎంఈవో కోరిక మేరకు నిరంతరంగా ఒక విద్యా వాలంటీర్ కు వేతనం చెల్లిస్తామని తెలిపారు.
పిల్లల విద్యాభివృద్ధికి మా వంతు సహకారం అందిస్తాం. మున్సిపల్ చైర్మన్
మున్సిపల్ చైర్మన్ బసవేశ్వర్ మాట్లాడుతూ….. కార్మికుల పిల్లల కోసం ఆర్థికంగా సహకారం అందిస్తున్న వెంకటరావు గారిని అభినందించారు.. గత సంవత్సరం షాద్ నగర్ శాసన సభ్యులు 30 మంది పేద పిల్లలను 8 వ వార్డులో గల బడిలో చేర్పించారని నేటికి అవారందరూ చదువుకుంటున్నారని గుర్తు చేశారు. అన్ని దానాల్లో కెల్ల విద్యాదానం గొప్పది అన్నారు. ఇలాంటి కృషి చేస్తున్న ఎంఈవో మనోహర్ కు , ఉపాధ్యాయ సంఘాలు, కార్మిక సంఘాల నాయకులకు అభినందనలు తెలిపారు.
వైస్ చైర్మన్ అందే మోహన్ మాట్లాడుతూ…పౌల్ట్రీ రైతుల సహకారంతో ఈ రోజు ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించటం అభినందనీయం అన్నారు. ఎలాంటి కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు… ఈ కృషి చేస్తున్న మనోహర్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
అనంతరం పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు..
ఈ కార్యక్రమంలో కార్మిక సంక్షేమ సంఘం నాయకులు పినపాక ప్రభాకర్, యూటిఎఫ్ జిల్లా కార్యదర్శి నర్సింలు గౌడ్, ఫరూక్ నగర్ మండల కార్యదర్శి బిజిలి సత్యం, టీయూపీఎస్ నాయకులు సురేష్ గౌడ్, సత్యం, పిఆర్టీయూ నాయకులు అంజనాయక్ , ఉపాధ్యాయులు చంద్రశేఖర్, విష్ణు, తిరుమలయ్య, సీఆర్పీలు రాధాకృష్ణ, భాగ్యలక్ష్మి, నాగమణి, ఉష,పాండు, పౌల్ట్రీ రైతులు బండారుపల్లి నాగేశ్వర రావు, మక్కపాటి సతీష్, కొత్త ప్రభాకర్, నువ్వుల నాగేశ్వర రావు, నాగమల్లేశ్వర రావు, కొర్రపాటి శ్రీను, పిల్లల తల్లి తండ్రులు పాల్గొన్నారు…