
ఈ69న్యూస్ జనగామ:- ప్రజల దాహార్తి తీర్చేందుకే చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని,ప్రజలకు సేవ చేయడమే అమరుల ఆశయాలను కొనసాగించడం అని సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అన్నారు.జనగామ జిల్లాలోని మరిగడి చౌరస్తా మరియు ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాలను కామ్రేడ్ రామావత్ బాలు నాయక్,కనకలక్ష్మి జ్ఞాపకార్థంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, గ్రామ పెద్దలు,హమాలీలు,ప్రజలు పాల్గొన్నారు.