మల్కాపూర్ అంగన్వాడీ కేంద్రంలో కంటి వైద్య శిబిరం
ఈ69న్యూస్:-జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని మల్కాపూర్ గ్రామ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారుల కోసం ఈరోజు ప్రత్యేక కంటి వైద్య శిబిరం నిర్వహించారు.వైద్య నిపుణులు పిల్లల కంటి ఆరోగ్యాన్ని పరీక్షించి,రాత్రిపూట చూపు సమస్యలు తరచుగా విటమిన్ ఎ లోపం వల్ల ఏర్పడతాయని తెలిపారు.ఈ లోపం వల్ల రోడాప్సిన్ అనే పదార్థం తక్కువగా ఉత్పత్తి అవుతూ,తక్కువ కాంతిలో చూపు ప్రభావితమవుతుందన్నారు.తల్లిదండ్రులకు విటమిన్ ఎ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది,ఆశా వర్కర్లు,అంగన్వాడీ టీచర్లు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.