గిరిజనుల తీజ్ పండుగ
తీజ్ వేడుకల్లోపాల్గొన్న డా.కీర్తి రెడ్డి,నిషీధర్ రెడ్డి
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి రేగొండ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రామన్నగూడెం తండాలో నిర్వహించిన గిరిజనుల తీజ్ పండుగ ముగింపు వేడుకల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా.చందుపట్ల కీర్తి రెడ్డి,జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిషీధర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా డా.కీర్తి రెడ్డి మాట్లాడుతూ..తీజ్ పండుగ గిరిజనుల ఆచార వ్యవహారాలు,విశిష్ట సంస్కృతికి ప్రతీక అని కొనియాడారు.సాంప్రదాయ పండుగలు సమాజంలో ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.గిరిజన సంస్కృతిని పరిరక్షించి భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందంటూ తండా ప్రజలకు తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ బూత్ అధ్యక్షుడు సంపత్,నాయకులు మోహన్,రాజేందర్,రవీందర్,గ్రామ పెద్దలు,మహిళలు,యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.