
ఈ69 న్యూస్ వర్ధన్నపేట మార్చి 20
వరంగల్ జిల్లా పరవతగిరి మండలం రావూరు గ్రామంలో ఇళ్లపైగా విద్యుత్ తీగలు ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. ఈ సమస్యను గ్రామస్తులు పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ తీగలు ఇళ్లకు చాలా దగ్గరగా ఉండటంతో ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని ప్రజలు భయపడుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు బయటికి రావడానికే భయపడుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి, విద్యుత్ తీగలను సరిచేసి గ్రామ ప్రజల ప్రాణాలను రక్షించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.