రైతులకు ప్రజ్వల్ నిర్వహణలో రైతులకు తోడ్పాటు :-.సి ఈ ఓ పెద్దపల్లి రామ్మూర్తి
ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి (రేగొండ /కొత్తపల్లి గోరి)
రైతులు పంట సంరక్షణ కొరకై సమగ్ర సస్య రక్షణ పద్ధతులు అవలంబించాలి అని డబ్ల్యూ డబ్ల్యూ ఎఫ్ ప్రతినిధి బొట్ల సతీష్ అన్నారు. గురువారం రోజున గోరి కొత్తపల్లి మండలం లోని వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో ప్రజ్వల్ రైతు ఉత్పత్తి దారుల సంఘం కార్గిల్ వారి సహకారంతో షెఫర్డ్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా నిర్వహించినటువంటి సమావేశంలో ముఖ్య అతిథిగా డబ్ల్యు.డబ్ల్యు.ఎఫ్ ప్రతినిధి బొట్ల సతీష్ పాల్గొని మాట్లాడుతూ… రైతులందరూ పంటల్లో రసాయనిక ఎరువులు,పురుగు మందులు వాడకం వల్ల నెలల్లో సామర్థ్యం నిస్సహిత స్థితిలో మారడం వల్ల రైతుకు సరైనటువంటి దిగుబడులు సాధించలేక అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ప్రజ్వల్ నిర్వహణలో బి సి ఐ (బెటర్ కాటన్ ప్రాజెక్టు) ద్వారా అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలలో భాగంగా తమ వంతు రైతులకు సహాయ సహకారాలు అందించాలని సంకల్పంతో కార్గిల్ నిర్వహణలో షెఫర్డ్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ముందుకు రావడం జరిగిందని వెంకటేశ్వరపల్లి గ్రామంలో బి సి ఐ రైతులకు పి. పి.ఈ కిట్లను 150 మంది రైతులకు సుమారు 70 వేల విలువగల పి పి ఈ కిట్లను రైతులకు అందించడం జరిగినది. రైతులు వ్యవసాయ క్షేత్రాలలో పురుగుమందు పిచికారి చేసే సమయంలో రైతులు అజాగ్రత్తల వల్ల చర్మ వ్యాధులు తలెత్తి ఆర్థికంగా నష్టపోవడం జరుగుతుందని దీనికి గాను సంరక్షణ కొరకై ఈ పీ పీ ఈ కిట్లను వాడాలని సూచించారు అదేవిధంగా పురుగుల యొక్క ఉద్దీతిని గమనించి సస్యరక్షణ పద్ధతులు అవలంబించే విధంగా ఈ కిట్లు ఎంతో గాను ఉపయోగపడుతుందని అన్నారు అదేవిధంగా ప్రజ్వల్ సి ఈ ఓ పి. రామ్మూర్తి మాట్లాడుతూ… రైతులు నాణ్యమైన పత్తి దిగుబడి సాధించడం కొరకు ప్రజ్వల్ కంపెనీ వారు రైతులకు అనేక అవగాహన కార్యక్రమాలతో పాటు ఆచరించే విధంగా అనునిత్యం ప్రజ్వల్ కంపెనీ వారు రైతులకు వెన్నటూ ఉంటున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అనుముల శ్రీనివాస్, పి.యు మేనేజర్ కళ్యాణ్ క్షేత్ర సిబ్బంది సిబ్బంది తోటకూరి సుజాత, లాంసాని రమాదేవి, దేవులపల్లి శ్రీహరి, గణపతి. రైతులు ప్రజ్వల్ పాలకవర్గ సభ్యులు, నవ చైతన్య పాలకవర్గ సభ్యులు కాడబోయిన రాజు బి సి ఐ రైతులు, ఉత్తమ రైతులు కానుగంటి పోశెట్టి, రమేష్, రాంబాబు, ఆవుల రమేష్ ,దేవేందర్, తిరుపతి, నరసయ్య ,రాజు, శంకర్, తిరుపతి. తదితరులు పాల్గొన్నారు.
