లక్షల రూపాయల నష్టం రైతుల ఆవేదన
సోమవారం ఖమ్మంజిల్లా వేంసూరు మండల పరిధిలోని లచ్చన్నగూడెం గ్రామానికి చెందిన కొందరు రైతులు జిల్లా కలక్టరేట్ ప్రాంగణంలో తెలుగు గళం జాతీయ తెలుగు దినపత్రిక ఎదుట తమకు న్యాయం చేయాలని గోడు వెళ్లబోసుకున్నారు.వివరాలలోకి వెళ్తే గ్రామంలో తాము గతేడాది సాగు చేసిన సారవ వరి పంటను ప్రభుత్వం ఐకెపి ద్వారా తమ గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో అమ్మి లక్షలరూపాయల సొమ్ము నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. క్వింటాకు 4 నుండి 5 కేజీల వరకు కోత విధిస్తున్నట్లు కొందరి రైతులకు నేలకొండపల్లి మిల్లర్లు ఐకెపి సిబ్బంది ద్వారా సమాచారం ఇచ్చి క్వింటాకు 10 నుండి12 కేజీల వరకు కోత కోసి డబ్బులు జమ చేశారని అప్పుడు మోసపోయామని తెలుసుకొని ఆందోళన బాట పట్టామని కౌలురైతు ఇమ్మడి మల్లేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.మహిళా రైతు సిద్ధినిబోయిన వెంకటరమణ మాట్లాడుతూ ట్రక్ షీట్ లు ఇవ్వమని అడిగినా ఇవ్వడం లేదని 150 బస్తాలు అమ్మగా 18 బస్తాలకు కోత విధించి సొమ్ము జమ చేశారని నేను ఎలా బ్రతికేదని మా వడ్లు మంచివే అని మోర పెట్టుకున్నా అందరికీ కటింగ్ చేశాం మీకు కూడా కటింగ్ చేశాం అని పొంతన లేని సమాధానం చెప్పారని న్యాయం చేయాలని కలక్టరేట్ కు వచ్చానని తెలిపారు.మరో రైతు పతేపరపు రామాంజనేయులు మాట్లాడుతూ 290 బస్తాలు అమ్మగా 40 బస్తాలకు కోత విధించి సొమ్ము చెల్లించారని ముందస్తు సమాచారం కూడా చెప్పలేదని స్పష్టం చేశారు.ధాన్యం ఎగుమతి చేసిన రెండో రోజు ఐకెపి సిబ్బందిని అడగగా ట్రక్ షీట్ వచ్చాక కటింగ్ తెలుస్తోందని 15 రోజులు పడుతుందని చెప్పి ఓటిపి చెప్పాక 12 కేజీలు చొప్పున కోత విధించిన విషయం గమనించిట్లు తెలిపారు.ఎక్కడ అన్యాయం జరిగిందో తమ సొమ్ము ఎవరు కాజేశారో అధికారులు తేల్చి న్యాయం చేయాలని కోరారు.అనంతరం మరో రైతు నాయుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ 408 బస్తాలు అమ్మగా 51 బస్తాలు కటింగ్ చేసి సొమ్ము చెల్లించారని ఆవేదన వ్యక్తం చేశారు.కౌలు చేసి ఇక ఎలా బతికి బట్ట గట్టాలని న్యాయం చేయాలని కలక్టర్ అని ప్రాధేయపడినట్టు తెలిపారు.మరో రైతు బోయినపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ 156 బస్తాలు అమ్మగా 21 బస్తాలకు కోత విధించి సొమ్ము జమ చేశారని తెలిపారు.తమకు న్యాయం చేయాలని కోరారు.మొత్తంగా చూస్తే జిల్లా కలక్టర్ అన్నదాతల ఆక్రందనపై కరుణించి పూర్తి వివరాలు సేకరిస్తే తీగ లాగితే డొంక కదిలింది అని వెనకటికి పెద్దలు చెప్పినట్లు లక్షలాది రూపాయల అవినీతి, అక్రమాలు,కారకులు బట్ట బయలు అయ్యే అవకాశం ఉన్నట్లు అగుపిస్తుంది.మరి ఇక ఏమి చేస్తారో వేచి చూద్దాం.