
ఈ69న్యూస్:- జనగామ జిల్లా లింగాల ఘనపురంలో రైతులకు భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు జరిగింది.స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి,జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.భూముల రక్షణ,సాదా బైనామాల regularization కోసం భూ భారతి చట్టం ఎంతో ఉపయోగకరమని వారు పేర్కొన్నారు.ధరణి ద్వారా పరిష్కారం కాని అనేక సమస్యలకు భూభారతి చట్టం ద్వారా మార్గం లభిస్తుందని,భూములకు భూదార్ నంబర్ కేటాయించడంతో భద్రత పెరుగుతుందని తెలియజేశారు.