ఆరోగ్య శిబిరం ఘనంగా నిర్వహణ
తెలుగు గళం న్యూస్ అయినవోలు/జూలై 28
బాల వికాస ఆధ్వర్యంలో ఐనవోల్ మండలం వనమాల కనపర్తి గ్రామంలో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు.ఈ శిబిరానికి లక్ష్మీనరసింహ హాస్పిటల్ వైద్య సహకారం అందించింది.డాక్టర్ సంధ్యారాణి ప్రత్యేక సహకారంతో మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు.శిబిరంలో మహిళలకు గర్భాశయ సంబంధిత పరీక్షలు, పిల్లలు లేని వారికి వైద్య పరీక్షలు నిర్వహించి,అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రిపీక ఎల్లస్వామి గారు,4వ వార్డు మెంబర్,బాలవికాస కోఆర్డినేటర్ కే.అనిత తదితరులు పాల్గొన్నారు.గ్రామ మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం ఇలాంటి శిబిరాలు భవిష్యత్‌లోనూ నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.