
ఈ69న్యూస్ వరంగల్:- వరంగల్ గిర్మాజిపేటలో 16.04.2025 రాత్రి 3 ఏళ్ల చిన్నారిపై లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపింది.తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో,పై అంతస్తులో కిరాయికి ఉండే లల్లు రంజాన్ (33),చిన్నారిని బిస్కెట్ పేరుతో తన గదికి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించినట్లు చిన్నారి తన నానమ్మకు తెలిపింది.కుటుంబ సభ్యులు అతడిని నిలదీసేలోపే పారిపోయాడు.బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదుతో ఇంతజార్గంజ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.