
వరంగల్ సీపి దౌర్జన్యాన్ని, వీసీ అవినీతిపై గవర్నర్ కు ఫిర్యాదు
అవినీతికి పాల్పడుతున్న వీసీ పై విచారణ కమిటీ వేసి వెంటనే తొలగించాలి.కాకతీయ యూనివర్సిటీలో పీ.ఎచ్.డీ అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయని ధర్నా చేస్తున్న విద్యార్ధి నాయకులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెష్టు చేసి కొట్టడాన్ని నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర గవర్నర్ ను విద్యా ర్ధి నాయకులు కలిసి వీసీ పై, పోలీస్ కమీషనర్ పై ఫిర్యాదు చేసినట్లు విద్యార్ధి నా యకులు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఏబీవీపీ స్టేట్ జాయింట్ సెక్రెటరీ మాచర్ల రాంబాబు, మాట్లాడుతూ, కస్టడీ లో వున్న విద్యార్థులపై పోలీసు లు కొట్టడం దారుణం అని, ఎం.జీ.ఎం నుండి కోర్టు కు తీసుకరావడానికి ఐదు గంటల సమయం పోలీసులు తీసుకున్నారని, డాక్టర్లను బెదిరించి పోలీసులకు అను గుణంగా రిపోర్ట్ రాయించే ప్రయత్నం చేసారని ఫిర్యా దులో పేర్కొన్నారు. యూనివర్సిటీలో విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించినందుకే వీసీ అక్రమంగా కేసులు పెట్టించారని ఫిర్యాదులో పేర్కొన్నా రు. కోర్టు జడ్జిమెంట్ లను అమలు చేయకుండా ధిక్క రించినందుకు వీసీ మరియు రిజిస్ట్రార్ పై కేయూ పోలీ స్ స్టేషన్ లో ఎఫ్.ఐ.ఆర్ అయిందని, ఒక కోర్టు ధిక్కర ణ కేసు వున్నవీసీ, సీపీ తో కలిసి ఆ ఎఫ్.ఐ.ఆర్ ను తీసేసి ప్రయత్నం చేయిస్తున్నాడని, ఒక ఎఫ్.ఐ.ఆర్ కేసు వున్న వ్యక్తితో సీపీ పక్కన కూర్చోపెట్టుకొని ప్రెస్స్ మీట్ పెట్టీ అబద్ధాలు చెప్పించడం దేనికి సంకేతం అని ఫిర్యాదులో తెలిపారు. ఈ సందర్భంగా కేయూ లో వీసీ ప్రో.తాటికొండ రమేష్ చేస్తున్న అవినీతిని గవర్నర్ కు వివరంగా విద్యార్థులు వివరించారుపీ.ఎచ్.డీ కేటగిరీ-1 లో అక్రమాలుపీ.ఎచ్.డీ కేటగిరీ -1 లో కేవలం ఫెలోషి ప్, నెట్, సెట్ అర్హత వున్న ఫుల్ టైం రీసెర్చి స్కాలర్లకు రావాల్సిన అడ్మిషన్లకు ఇంటర్వూలు పెట్టీ ఆ తర్వాత డబ్బులు చేతులు మారాక యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా దీన్స్ లతో రూల్సు మార్పించి వాటిపై బల వంతంగా సంతకాలు చేయించి పార్ట్ టైం పీ. ఎచ్. డీ లు ఇచ్చారని, పీ.ఎచ్.డీ కేటగిరీ -1 అడ్మిషన్లు అక్రమం అని మళ్లీ అడ్మిషన్లు జరపవద్దని హై కోర్టు స్టే ఇచ్చినా కూడా కోర్టు దిక్కరణకు పాల్పడి అడ్మిషన్లు జరిపారని, రిజిస్ట్రార్ వెంకట్ రామ్ రెడ్డిను కోర్టు ధిక్కరణ నేరం కింద హైకోర్టు కోర్టుకు రమ్మందని పేర్కొన్నారు. పీ.ఎచ్.డీ కేటగిరీ -1 లో భర్తీ కాని సీట్లు కేటగిరీ – 2 కు మార్చి నింపాలని యూనివర్సిటీ విడుదల చేసిన పీ.ఎచ్.డీ నిబంధనల్లో వుందని, వారి నిబంధనలను వారే పాటించలేదని అన్నారు.పీ.ఎచ్.డీ. కేటగిరీ -2 లో జరిగిన అవకతవకలుపీ.ఎచ్.డీ కేటగిరీ -2 పరీక్షా పత్రం యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ లతో సంబంధం లేకుండా తయారు చేయించి ప్రతి విభాగంలో పదుల సంఖ్యలో ప్రశ్నలు తప్పుగా ముద్రించించారని, అటు వంటి పరీక్షల ఫలితాలు విద్యార్థులకు అంటగట్టి మెరి ట్ విద్యార్థులకు సీట్లు రాకుండా చేసారని, పీ.ఎచ్.డీ కేటగిరీ -2 ప్రశ్నా పత్రంలో దొర్లిన తప్పుల గురుంచి వి ద్యార్థి నాయకులు మాట్లాడితే కేసులు పెట్టించారని, వారికి సీట్లు రావద్దని ఇంటర్వ్యూ కమిటీలు వారికి అనుగుణంగా వేసుకొని పీ.ఎచ్.డీ నిబంధనలకు వి రుద్ధంగా ఇంటర్వ్యూలు జరిపారని ఫిర్యాదులో పే ర్కొన్నట్లు తెలిపారు.భూకబ్జా దారుడు అశోక బాబు ను కాపాడుతున్న వీసీకేయూ భూముల కబ్జాదారుల పై ల్యాండ్ కమిటీ రిపోర్టు సబ్మిట్ చేసినా కూడా భూ కబ్జా దారులయిన పెండ్లి అశోక బాబు మరో పన్నెండు మందితో కుమ్ముక్కయి ల్యాండ్ కమిటీ రిపోర్టును పాలక మండలి ఆమోదానికి పెట్టకుండా రాజకీయ నాయకులతో పాలక మండలిని సభ్యులకు ఫోన్ చేయించి వారిని మచ్చిక చేసుకొని ల్యాండ్ కమిటీ రిపోర్టును మార్చే ప్రయత్నం చేస్తూ కబ్జాదారులను ప్రోత్సహిస్తున్నారని పేర్కొనారు.అర్హత లేని అసమర్థ వీసీ19-07-2010 లో ప్రొఫెసర్ అయి తేదీ 23.07.2019 (వీసీ గా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ) నాటికి 10 సంవత్సరాలు నిండకుండానే వీసీ కొ రకు అప్లై చేసుకొని రాజకీయ నాయకుల అండతో అక్రమంగా వీసీ గా చార్జి తీసుకొని విద్యార్థుల జీవి తాలతో చేలగాటడం ద్రోహం అని, హైకోర్టులో కేసు వున్నా, కేసు జడ్జిమెంట్ వచ్చేంత వరకు వీసీ గా తప్పు కునే నిజాయితీ వుండాలని, అదిలేకే జడ్జిమెంట్ వచ్చే లోపల ఈ అవినీతికి పాల్పడుతున్నారని అందులో పేర్కొన్నారు. యూనివర్సిటీ చట్టం సెక్షన్ 15.1 నిబంధ నలకు తూట్లు పొడిచి ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ ను రిజిస్ట్రా ర్ గా నియమించి, ఆయన్నే కీలక ఇతర పదవుల్లో పెట్టీ అవినీతికి ఆయనతో సంతకాలు చేయిస్తూ పాల న కొనసాగిస్తున్నాడని అన్నారు. మహిళా పీజీ కళాశా లలో విద్యార్థుల దగ్గరి నుండి డబ్బులు తీసుకొని చా లన్లు కడతామని లక్షల కుంభకోణం చేసిన అన్వేషిని అప్పటి కేయూ రిజిస్ట్రార్ త్రీ మెన్ కమిటీ వేసి ఉద్యో గం నుండి తొలగిస్తే మళ్లీ ఆ అద్యోగిని పరీక్షల విభా గంలో నియమించి అవినీతి కు పాల్పడ్డారని అన్నారు.
రూ నెలకు 8 లక్షలు వృధా16 మంది రిరైర్డ్ ప్రొఫెసర్లను యూజీసీ నిబంధనలకు, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా అనుబంద అధ్యాపకులుగా నియమించి కోటి రూపాయల అవినీతికి పాల్పడింది నిజం కాదా అని ప్రశ్నిచారు. నేర చరిత్ర వున్న వాళ్ళను, వేరే యూ నివర్సిటీలో రిజిస్ట్రార్ గా వున్న వాళ్ళను నియమించి నెలకు రూ.ఎనిమిది లక్షలు ప్రజా ధనం దుర్వినియోగ పరుస్తున్నారని తెలిపారు. కొత్తగూడెం ఇంజనీరింగ్ కళాశాల నుండి సీనియర్ ప్రాతిపాదికన కాకుండా ఒక జూనియర్ టీచర్ అయిన ప్రో.సదానందం ను అక్కడి నుండి కేయూ కు బదిలీ చేసుకొని ఆయనను అవినీ తిలో భాగస్వామ్యం చేస్తున్నారని, పీ.ఎచ్.డీ ఇంట ర్వ్యూ కమిటీల్లో ఆయన్ను పెట్టీ విధ్యార్థి నాయకులకు సీట్లు రాకుండా మార్కులు వేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. యూనివర్సిటీ చట్టానికి విరుద్ధంగా వీసీ కి ఇష్టం వచ్చిన వాళ్ళని డిపార్ట్ మెంట్ హెడ్ లుగా ని యమించుకుని విద్యార్థులపై క్రమశిక్షణా చర్యలు తీ సుకునే ప్రయత్నం చేస్తున్నారని, సోశాలజీ విభాగం, గణితం, ఫిజిక్స్, బాటనీ లలో సీనియారిటీ ప్రకారం రావాల్సిన హెడ్ షిప్ ను కాలదన్ని ఇంటర్వ్యూలో వీసీ కు అనుకూలంగా వున్న వాళ్ళను పెట్టుకొని పీ.ఎచ్.డీ సీట్లు విద్యార్థి నాయకులకు రాకుండా చేస్తున్నారని అన్నారు. ఒక గణితం విభాగంలో నియామకం అయి న ప్రో.మల్లారెడ్డి ని యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ఇంజనీరింగ్ కాలేజీ కి ప్రిన్సిపాల్ గా నియమించి ఆయ నతో అవినీతికి ఆజ్యం పోస్తున్నారని అన్నారు.ఫార్మసీ లో అవినీతిఫార్మసీ లో డీన్ పదవీ కాలం అయిపోయి నా కూడా మరొక ప్రొఫెసర్ కు డీన్ ఇవ్వకుండా ఆయ న్నే ఇంటర్వ్యూ కమిటీల్లో పెట్టీ అక్రమాలకు పాల్పడ డం, ఇన్స్పెక్షన్ పేరు మీద ఎటువంటి ఇన్స్పెక్షన్ చేయ కుండానే కొన్ని ఫార్మసీ కాలేజీ లకు సీట్లు తగ్గించి, డ బ్బులు చేతులు మారాక ఇన్స్పెక్షన్ చేసి సీట్లు ఇస్తు న్నారని, అకస్మాత్తుగా ఫార్మసీ ప్రిన్సిపాల్ ను తీసివేసి పీ.ఎచ్.డీ అడ్మిషన్లు, ప్రైవేటు ఫార్మసీ కాలేజీల కోసం తమకు అనుగుణంగా వున్న వారిని ప్రిన్సిపాల్ గా నియమించుకొని వీసీ అవకతవకలు పాల్పడుతు న్నారని పేర్కొన్నారు. యూనివర్సిటీ ను అభివృద్ధి చేసి చెప్పుకోవాల్సింది పోయి అవినీతి చేసి తప్పుడు డాటా న్యాక్ కు సమర్పించి పేపర్లలో యూనివర్సిటీ పరువు తీసారని అన్నారు.ఇటువంటి అవినీతిని ప్రశ్నిస్తున్న విద్యార్థి నాయకులను టార్గెట్ చేసి పోలీసులతో అక్ర మ కేసులు బనాయించి పైశాచిక ఆనందం పొందుతూ ఉద్యమాలను నీరు గార్చెందుకు విద్యార్తులకు ఆకస్మిక సెలవులు ఇస్తూ విద్యా వ్యవస్థను భ్రాష్టు పట్టిస్తున్న వీసీ పై గవర్నర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు.గవర్నర్ ను కలిసిన వారిలో ఏబీవీపీ కాకతీ య యూనివర్సిటీ ఇంచార్జ్ నిమ్మల రాజేష్ , స్టేట్ జాయింట్ సెక్రెటరీ, స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ జీవన్ లు వున్నారు