
వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆదేశాలతో వడ్ల కొనుగోలు కేంద్రాల ప్రారంభం
ఈ69న్యూస్:- వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆదేశాల మేరకు మొలకలగూడెం,ఒంటిమామిడిపల్లి,పెరుమల్లగూడెం గ్రామాల్లో వడ్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.ఈ కార్యక్రమాలు అయినవోలు మండల కాంగ్రెస్ అధ్యక్షులు సమ్మెట మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయి.ప్రధానంగా పాల్గొన్నవారు.ఎస్టీ సెల్ కోఆర్డినేటర్ రాయపురం సాంబయ్య,జెడ్పీటీసీ పోలేపల్లి బుచ్చిరెడ్డి,సీనియర్ నాయకులు రూప్ రెడ్డి,సాయి రెడ్డి,ఎలిషా,లింగరాజు,గిరిక రాజు,బరిగాల భాస్కర్,ఎండి రఫీ,సునీల్,చిరంజీవి రెడ్డి తదితరులు.రైతుల శ్రేయస్సుకు ఈ కేంద్రాలు తోడ్పడతాయని వారు పేర్కొన్నారు.