విద్యార్థులు పక్కా ప్రణాళికతో చదివితే ఉన్నత భవిష్యత్తు
పక్క ప్రణాళికతో ఉన్నత భవిష్యత్తును, ఉన్నత స్థానాన్ని చేరుకోవచ్చని మహబూబాబాద్ జిల్లా ఏసీజీఇ శ్రీరాములు డిసిబి సెక్రెటరీ బాలాజీ అన్నారు, చిల్లంచెర్ల ఉన్నత పాఠశాలను ఈరోజు మహబూబాబాద్ జిల్లా ఎస్ఎస్సి మానిటరింగ్ టీం యం శ్రీరాములు ఏసీజీఈ, వి బాలాజీ డిసిబి సెక్రెటరీ సందర్శించారు. వారు పాఠశాలలో 10వ తరగతి సిలబస్ పూర్తి అయినదా, రివిజన్ మొదలైందా, ప్రత్యేక పరీక్షల మరియు ప్రత్యేక తరగతుల నిర్వహణ వివరాలను సేకరించారు ప్రత్యేక పరీక్షలకు విద్యార్థులు అందరూ హాజరయ్యేలా చూడాలని సూచించారు,పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు పదవ తరగతి పునాది వంటిదని కావున విద్యార్థులు అందరూ అశ్రద్ధ చేయకుండా శ్రద్ధగా చదువుకోవాలని, ఎస్ఎస్సి పరీక్షల వరకు గల సమయాన్ని సద్వినియోగం చేసుకొని మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు టైం టేబుల్ తయారు చేసుకుని తదనుగుణంగా ప్రిపరేషన్ కొనసాగించాలని అన్నారు ఉపాధ్యాయులు కూడా సామర్ధ్యాలలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని సూచించారు,ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మంద జయ, ఉపాధ్యాయులు కవిత, శ్రీనివాస్, చందా రవీంద్ర కుమార్,రాయిపెల్లి యాకయ్య, రహీమున్నీసా, కన్న భాస్కర్, శాంసన్ సుధాకర్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.