
ఈ69న్యూసచ వరంగల్ (GWMC):నగరంలోని బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో నిర్మాణంలో ఉన్న స్విమ్మింగ్ పూల్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మేయర్ గుండు సుధారాణి బుధవారం అధికారులను ఆదేశించారు.ఇండోర్ స్టేడియం పరిధిలో సుమారు రూ.1.50 కోటి అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ పూల్ పనులను మేయర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.పనుల పురోగతిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆమె,ఆలస్యం సరికాదని పేర్కొన్నారు.పనులు త్వరగా పూర్తయ్యేలా ఇంజనీరింగ్ శాఖ అధికారులు రోజూ పర్యవేక్షణ చేయాలని ఆమె సూచించారు.అలాగే,స్విమ్మింగ్ పూల్ చుట్టూ ఆకర్షణీయమైన గ్రీనరీ ఏర్పాటు చేయాలని హార్టికల్చర్ అధికారులను మేయర్ ఆదేశించారు.ఈ సందర్బంగా హెచ్.ఓ.రమేష్,ఎం.హెచ్.ఓ డా. రాజేష్,ఈ.ఈ.రవి కుమార్,డి.ఈ.రాజ్ కుమార్,ఏ.ఈ.శ్రీకాంత్ తదితర అధికారులు పాల్గొన్నారు.