shahi.co.in
షాహీ లో గతతొమ్మిది రోజులుగా ఎందుకు రెండు వేల మంది రోడ్డు పై బెటాయించి నిరసన తెలుపుతున్నారు ఈ పరిశ్రమలో ఏ యూనియన్ లేదు ఏ నాయకుడు వీరి వెనుక వుండి ధైర్యం చెప్పి ముందుకు నడిపించలేదు ముందు వారి కోపం కట్టలు తెంచుకొని ఒక్కసారిగా బయటకి వచ్చారు పదమూడు సంవత్సరాలుగా చేస్తున్న కూడా ఒక్కరికీ డి ఏ మాత్రం పడి రూపాయలు పెరిగింది తప్ప జీతం మాత్రం పెరగడం లేదు 2012 సంవత్సరంలో వచ్చిన జీవో ప్రకారం మాత్రమే వేతనం చెల్లిస్తున్నారు కానీ ఇప్పటి అదే వేతనం ఇస్తున్నారు కానీ మరి మారుతున్న రోజులు పెరుగుతున్న ధరలు మరి వాటికి అనుకూలంగా కాదు కదా కనీసం కూడా లేదు అదే 2012 ప్రకారం 9000 వేల రూపాయలు ఇస్తున్నారు ఇప్పుడు కొత్తగా కంపెనీలోకి వచ్చిన వారికి కూడా అదే జీతం మరి అసలు వీరికి నెపుణ్యం వున్న వారికి ఇచ్చేదీ ఒకే రకమైన జీతం అంతే కాదు.
అసలు వీరు రోడ్డు మీదకి రావడానికి గల కారణాలు ఏంటి ఎందుకు ఎన్ని సంవత్సరలుగా లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చారు
ఇందులో ఎవరు అయితే తిరగబడుతారు అనుకున్నారో వారిని సూపర్ వైజర్ పేరుతో ఐదు వేల రూపాయలు పెంచారు మిగతా వారికి మాత్రం అదే పాత చింతకాయ పచ్చడి మాదిరిగా ఇస్తున్నారు
అసలు షాహీ ఎక్స్ పోర్ట్ లో ఏం పని చేస్తారు ఇందులో ఏం జరుగుతుంది .
షాహీ ఎక్స్ పోర్ట్ లో ఇతర దేశాలకి ఇక్కడి నుండి గార్మెంట్స్ ఎక్స్పోర్ట్ చేస్తారు అవి డాలర్ల రూపంలో వాటి అమ్మకం వుంటుంది
ఒక్కో సెక్షన్ లోనాలుగు వందల నుండి ఐదు వందల మంది పని చేస్తుంటారు ఇందులో ఒక్క క్క గ్రూప్ ఒక్కొక్క పని చేస్తుంది అంటే ఉదాహరణకి కొంత మంది కాలర్ కుడితే కొంత మంది చేతులు అంటే చొక్కా యొక్క భాగాలను విడివిడిగా మిషన్ పై కుడుతుంటారు అందరూ కలిసి ఒక గంటలో వీరు 100 చొక్కాలు తయారు చేస్తారు అంటే ఒక లైన్ లో వీరు 70 మంది ఉంటారు మొత్తం కుట్టే పనిలో 16 లైన్ లు వుంటాయి ఇందులో కట్టింగ్ విభాగం మరియు ఐరన్ చేసే వాళ్ళు శుభ్రం చేసే అని వివిధ విభాగాలు వుంటాయి . వీరు తయారు చేసే ఒక్క చొక్కా ఖరీదు సుమారుగా 10000 వేల రూపాయలు వుంటుంది చిన్న షార్ట్ విలువ 5000 వేల వరకు వుంటుంది
ఇది ఇందులో పని విధనం కానీ ఇందులో పని చేసేది ఎక్కువ మహిళా కార్మికులు ఎక్కడ సమస్య మేడలు అయ్యింది వీరు 8 గంటలలో పూర్తి చేయాల్సిన పనిని వీరు కేవలం నాలుగు గంటలలో పూర్తి చేయాలని పని ఒత్తిడి ప్రారంభించారు ఎక్కువ ప్రొడక్షన్ వస్తే కార్మికులకి లభ్యం ఏం లేదు కానీ ఆ పని చేపించిన సూపర్ వైజర్ కి మాత్రం వీరు చేసిన అధిక ప్రొడక్షన్ పై ఇన్సెంటివ్ వుంటుంది కానీ ఒక వేల వీళ్ళు టార్గెట్ చేయక పోతే జి ఏం వద్దకి సూపర్ వైజర్ లు తీసుకెళ్తారు అప్పుడు వ్యయాలు ఐ డి కార్డు చూసి మీరు సీనియర్ లు కదా మీరు ఎందుకు చేయడం లేదు పని ఎందుకు కావడం లేదు అని బూతులు తిడుతారు అని మహిళా కార్మికులు వాపోతునరు ఒక కార్మికురాలు ని నానా బూతులు తిట్టడం వల్ల మనోవేదన కి గురికావడం వలన తన భర్త పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం కూడా జరిగినది అని కార్మికురాలు తెలిపింది అప్పటి నుండి తనకి వేదింపులు అధికం కావడం వలన తనతో అదికరికంగా రిజైన్ చేపించే ప్రయత్నం కూడా చేపించారు .
అంతే కాకుండా మహిళలు ఉదయం పనిలోకి వచ్చినప్పటి నుండి మూత్రశాలలకి కూడా వెళ్లనివ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు అని అంతే కాకుండా టార్గెట్ కాకుంటే కార్మికులు భోజనం కూడా చేయకుండా టార్గెట్ పూర్తి చేయడం కోసం భోజనం కూడా చేయం అని తెలుపుతున్నారు ఆరోగ్య సమస్యలు వస్తే డాక్టర్ వద్దకి వెళితే చిన్న పిల్లల లాగా సగం టాబ్లెట్ మాత్రమే ఇస్తారు అని తెలుపుతున్నారు ఎక్కడ మూత్రశాలకి వెల్లసీ వస్తుందో అని సరిగా నీరు కూడా త్రాగకుండా పని చేస్తున్నాం అని వాపోయారు ఇక్కడ ఎక్కువగా పెళ్ళికాని అమ్మాయి లు వుండడం వలన వారికి హాస్టల్ వసతి కల్పిస్తాం అని చెప్పి వార్థి అధిక పని చేపించుకుంటారు అని తెలియజేశారు వారు ఎలాంటి వాటిని అడుగరాడు ఒక వేల ఏదైనా సమస్య అని చెపితే మీ సౌకర్యాలు అన్నీ రద్దు చేస్తాం అని బెదిరిస్తున్నారు అని చెపుతున్నారు పధ్నాలుగు సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులకి మాత్రం 12000 వేల రూపాయలు వున్నాయి సూపర్ వైజర్ లకి మాత్రం ముప్పై వేల రూపాయలు కొత్తగా చేరిన వారికి 23000 వేల రూపాయలు చెల్లిస్తున్నారని కావున మాకు కూడా కనీసం 15000 వేల నుండి 18000 వేల రూపాయాలకి పెంచాలి అని వారు ఇన్ని రోజులుగా ధర్నా నిర్వహిస్తున్నాం అన్నారు గత 13 సంవత్సరాలుగా కనీస వేతనాల జీవోలు కెసిఆర్ సవరించలేదు. కోతగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సవరించలేదు ఫలితాంగానే నేడు షాహీ కార్మికులకు ఈ గోస పడుతున్నారు
వీరికి అల్ ట్రేడ్ యూనియన్స్ మద్దతు లభించింది . అన్నీ కార్మిక సంఘాలు వీరి డిమాండ్ లు సరియిననవే అని వీరికి మద్దతుగా నిలుస్తున్నాయి .. ఆర్ బి ప్రసాద్
9948230396