
షేక్ రహీం, తమనం వీరమ్మ ల మృతి బాధాకరం
విద్యుత్ ప్రమాదంతో షేక్ రహీం మృతి బాధాకరమని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శనివారం నడిగూడెం మండలం వల్లపురం గ్రామానికి చెందిన షేక్ రహీం మృతదేహాలకి పూలమాలవేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ . కుటుంబ సభ్యులను పరామర్శించారు, కొంత ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం అదే గ్రామానికి చెందిన తమనం వీరమ్మ మృతి చెందగా ఆమె మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి, మనోధైర్యం కల్పించారు. కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వట్టికూటి చంద్రయ్య, టిఆర్ఎస్ నాయకులు తమణం వెంకటరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.