జనగామ జిల్లా జఫర్ఘఢ్ మండలంలోని తమ్మడపల్లి జి గ్రామంలో సర్పంచ్ పదవి కోసం జరిగిన ఉత్కంఠభరిత పోరాటానికి చివరకు తెరపడింది.గత కొన్ని రోజులుగా గ్రామంలో రాజకీయ సమీకరణాలు వేడెక్కి,“పులికి-మేకకు పోటీ”గా వెల్లువెత్తిన ప్రచారం ఓటింగ్ రోజున ఊపందుకుంది.కాంగ్రెస్ పార్టీ తరఫున,సిపిఎం మద్దతుతో పోటీ చేసిన అన్నం స్వప్న రాణి-బ్రహ్మారెడ్డి ప్రజాభిమానాన్ని సొంతం చేసుకొని విజయం సాధించారు.బిఆర్ఎస్ తరఫున పోటీ చేసిన బషీర్-బషీరా దంపతులు తమ ఉద్యమపంథా,సాధారణ కుటుంబ నేపథ్యం,కష్టపడి చేసిన ప్రచారం ఉన్నప్పటికీ,ఓటర్ల తీర్పు తమ వైపుకు మళ్లించుకోవడంలో విఫలమయ్యారు.స్వప్నరాణి విజయం వెనుక ఆమె భర్త అన్నం బ్రహ్మారెడ్డి గత మూడు దశాబ్దాల్లో నిర్మించుకున్న రాజకీయ ప్రభావం,గ్రామస్థాయిలో ఆయనకు ఉన్న నెట్వర్క్,అనుభవం కీలక పాత్ర పోషించాయని విశ్లేషకులు భావిస్తున్నారు.మార్కెట్ కమిటీ చైర్మన్గా,గ్రంథాలయ చైర్మన్గా ఆయన నిర్వహించిన బాధ్యతలు గ్రామస్తుల్లో నమ్మకం పెంచినట్లు తెలుస్తోంది.మరోవైపు బషీర్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చేసిన ఆత్మాహుతి ప్రయత్నం,ఆయన సాధారణ కుటుంబ నేపథ్యం,వ్యవసాయం ఆధారంగా జీవనం వంటి అంశాలు కొంతమంది యువ ఓటర్లను ప్రభావితం చేసినా..మొత్తంలో గ్రామస్థాయి ఓటు బ్యాంక్ స్వప్నరాణి వైపే కేంద్రీకృతమైంది.విజయం ప్రకటించగానే స్వప్నరాణి అనుచరులు సంబరాల్లో మునిగిపోయారు.గ్రామంలో పటాకులు పేల్చి,డీజే పాటలతో ఆనందోత్సాహాలతో విజయం జరుపుకున్నారు.ఓటర్లకు ధన్యవాదాలు తెలుపుతూ స్వప్నరాణి-బ్రహ్మారెడ్డి“గ్రామ అభివృద్ధే నా లక్ష్యం.అందరి అండదండలు ఉంటే తమ్మడపల్లి జి ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాను”అని ప్రకటించారు.తమ్మడపల్లి జి లో ఎన్నికల ఉత్కంఠ ముగిసినా..ఈ పోటీ గ్రామ రాజకీయాల్లో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినట్లు కనిపిస్తోంది
సిపిఎం పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని స్వప్నరాణి-బ్రహ్మారెడ్డి విజయం జనగామ జిల్లా జఫర్ఘఢ్ మండలంలోని తమ్మడపల్లి జి గ్రామంలో సర్పంచ్ పదవి కోసం జరిగిన ఉత్కంఠభరిత పోరాటానికి చివరకు తెరపడింది.గత కొన్ని రోజులుగా గ్రామంలో రాజకీయ సమీకరణాలు వేడెక్కి,“పులికి-మేకకు పోటీ”గా వెల్లువెత్తిన ప్రచారం ఓటింగ్ రోజున ఊపందుకుంది.కాంగ్రెస్ పార్టీ తరఫున,సిపిఎం మద్దతుతో పోటీ చేసిన అన్నం స్వప్న రాణి-బ్రహ్మారెడ్డి ప్రజాభిమానాన్ని సొంతం చేసుకొని విజయం సాధించారు.బిఆర్ఎస్ తరఫున పోటీ చేసిన బషీర్-బషీరా దంపతులు తమ ఉద్యమపంథా,సాధారణ కుటుంబ నేపథ్యం,కష్టపడి చేసిన ప్రచారం ఉన్నప్పటికీ,ఓటర్ల తీర్పు తమ వైపుకు మళ్లించుకోవడంలో విఫలమయ్యారు.స్వప్నరాణి విజయం వెనుక ఆమె భర్త అన్నం బ్రహ్మారెడ్డి గత మూడు దశాబ్దాల్లో నిర్మించుకున్న రాజకీయ ప్రభావం,గ్రామస్థాయిలో ఆయనకు ఉన్న నెట్వర్క్,అనుభవం కీలక పాత్ర పోషించాయని విశ్లేషకులు భావిస్తున్నారు.మార్కెట్ కమిటీ చైర్మన్గా,గ్రంథాలయ చైర్మన్గా ఆయన నిర్వహించిన బాధ్యతలు గ్రామస్తుల్లో నమ్మకం పెంచినట్లు తెలుస్తోంది.మరోవైపు బషీర్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చేసిన ఆత్మాహుతి ప్రయత్నం,ఆయన సాధారణ కుటుంబ నేపథ్యం,వ్యవసాయం ఆధారంగా జీవనం వంటి అంశాలు కొంతమంది యువ ఓటర్లను ప్రభావితం చేసినా..మొత్తంలో గ్రామస్థాయి ఓటు బ్యాంక్ స్వప్నరాణి వైపే కేంద్రీకృతమైంది.విజయం ప్రకటించగానే స్వప్నరాణి అనుచరులు సంబరాల్లో మునిగిపోయారు.గ్రామంలో పటాకులు పేల్చి,డీజే పాటలతో ఆనందోత్సాహాలతో విజయం జరుపుకున్నారు.ఓటర్లకు ధన్యవాదాలు తెలుపుతూ స్వప్నరాణి-బ్రహ్మారెడ్డి“గ్రామ అభివృద్ధే నా లక్ష్యం.అందరి అండదండలు ఉంటే తమ్మడపల్లి జి ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాను”అని ప్రకటించారు.తమ్మడపల్లి జి లో ఎన్నికల ఉత్కంఠ ముగిసినా..ఈ పోటీ గ్రామ రాజకీయాల్లో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినట్లు కనిపిస్తోంది