సర్వేయర్లు అవగాహన కలిగి ఉండాలి
భూమి కొలతలకు సంబంధించి ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అందుబాటులోకి వచ్చిన నూతన సర్వే మిషన్ పై లైసెన్స్డ్ సర్వేయర్లు పూర్తి అవగాహన కలిగి ఉండాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు.భూమి కొలతల శాఖ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో నూతన సర్వే మిషన్ తో భూమి కొలతలు ఏ విధంగా చేపట్టాలనే అంశంపై గురు,శుక్రవారాల పాటు హైదరాబాద్ లోని భూమి,కొలతల శాఖ నుండి వచ్చిన మాస్టర్ ట్రైనర్ తో ధర్మసాగర్,హసన్ పర్తి మండలాలకు సంబంధించిన లైసెన్స్డ్ సర్వేయర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తుండగా జిల్లా కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా సర్వే చేసే పాత,నూతన మిషన్ల గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.నూతన మిషన్ తో సర్వే చేసే విధానాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ లైసెన్సుడ్ సర్వేయర్లు భూములకు సంబంధించిన ఖచ్చితమైన కొలతలు తీసుకోవాలన్నారు.భూముల సర్వేకు సంబంధించిన అన్ని అంశాల పైన తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలన్నారు.నూతన సర్వే మిషన్ లోని అంశాలు (ఫీచర్స్) అన్నింటిపై అవగాహన కలిగి ఉండాలన్నారు.ఈ సందర్భంగా జిల్లా భూమి కొలతల అసిస్టెంట్ డైరెక్టర్ సిహెచ్.శ్రీనివాసులు,డిప్యూటీ ఇన్స్పెక్టర్లు సారంగపాణి,రాజనర్సింహ,మండల సర్వేయర్లు పాల్గొన్నారు