సార్వత్రిక సమ్మె ను సింగరేణిలో జయప్రదం చేయండి
నాలుగు లేబర్ కోడ్ ల రద్దే కీలకం:తీగల క్రాంతి కుమార్(ఐఎన్టియూసి జాయింట్ సెక్రటరీ)
సోమవారం సత్తుపల్లి సింగరేణి జే.వి.ఆర్ సి.హెచ్.పి ప్రాంగణంలో ఐఎన్టీయూసీ ఫిట్ సెక్రటరీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సింగరేణి ఐక్య కార్మిక సంఘాల సమావేశం జరిగింది.కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా ఫిబ్రవరి 12 న జరగనున్న సార్వత్రిక సమ్మెలో సింగరేణి కార్మికులు,కాంట్రాక్టు,అవుట్సోర్సింగ్,డైలీ వేజ్ కార్మికులు విధులను బహిష్కరించి పాల్గొని జయప్రదం చేయాలని సింగరేణి జేఏసీ సంఘాల నాయకులు త్యాగ రాజన్,తీగల క్రాంతికుమార్ , సూర్య ప్రకాష్ , బుగ్గ సుధాకర్,ప్రసాద్ లు కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఐఎన్టియూసి జాయింట్ సెక్రటరీ తీగల క్రాంతికుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్ ల వల్ల కార్మిక వర్గానికి తీవ్ర నష్టం జరుగుతుందని,సమ్మె లో ప్రధాన డిమాండ్ లేబర్ కోడ్లు రద్దేనని మీడియాకు స్పష్టం చేశారు.దేశ స్వాతంత్ర్యానికి పూర్వం దేశంలో ఉన్న కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ లు గా మార్చిందని,ఇట్టి లేబర్ కోడ్ లను ఏప్రిల్ నుంచి అమలు చేయడం కోసం పరిశ్రమల యాజమాన్యాలు ప్రయత్నాలు చేస్తున్నారని వారు
ఆరోపించారు. కొత్త లేబర్ కోడ్ లు కార్మికుల హక్కులను హరిస్తాయని , కార్మిక వర్గం కు నష్టం జరిగే ఇట్టి లేబర్ కోడులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు ఫిబ్రవరి 12 న సమ్మె లో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపు నిచ్చాయని కనుక సింగరేణి లో కూడా సమ్మె ను జయప్రదం చేయాలని వారు కార్మికవర్గానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో:తిరుమల రావు,రమేష్ ,మోహన్,దొడ్డ పల్లి రమేష్ ,అజయ్ , సుభాని,రత్నకుమార్ , రామకృష్ణ ,నాగేష్ , వెంకటేశ్వర్లు ,కృష్ణ , అశోక్ , వినయ్ ఇతర ముఖ్య నాయకులు , కార్యకర్తలు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.