సైబర్ నేరాల పట్ల అవగాహనతో ఉండాలి
వరంగల్ జిల్లా వర్దన్నపేట మండలం నల్లబెల్లి గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నల్లబెల్లి గ్రామ సర్పంచ్ జక్కిఅనిత శ్రీకాంత్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ సౌజన్య పాల్గొని ప్రజలకు ఈ కేవైసీ పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తూ సైబర్ నేరస్తుల పట్ల అవగాహనతో మెలగాలని ఎలాంటి ఓటీపీలు ఎవరికి పంపియకూడదు అని తెలియజేశారు అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఇన్సూరెన్స్ గురించి తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ మేకల దేవేందర్, ఆర్థిక అక్షరాస్యత కోఆర్డినేటర్ రాజేశ్వరి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.