జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల వ్యాప్తంగా యూరియా ఎరువుల కొరత రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోంది.పంటలు కీలక దశలో ఉండటంతో రైతులు యూరియా కోసం డిపోలు,సొసైటీల వద్ద ఉదయం నుంచే క్యూలు కడుతున్నారు.అయితే సరిపడా ఎరువు అందక రైతులు నిరాశతో తిరుగు పయనం కావలసి వస్తోంది.రైతులు మాట్లాడుతూ..“పంటకు యూరియా అత్యవసరం అయిన సమయంలో ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదు.ఉదయం నుంచి సాయంత్రం వరకు లైన్లలో నిలబడి కూడా ఒక్క సంచి దొరకడం లేదు.ఇలా కొనసాగితే పంటలు పండవు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అధికారులు వెంటనే ముందస్తు చర్యలు తీసుకొని రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.ఎరువుల కొరతతో పంటలు నష్టపోతే రైతాంగం మరింత సంక్షోభంలో పడే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు