
సిఐటియు జిల్లా నాయకులు షేక్ బషీరుద్దీన్.
సిఐటియు జిల్లా నాయకులు షేక్ బషీరుద్దీన్……
కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలి÷ కెవిపిఎస్ డివిజన్ కార్యదర్శి కొమ్ము శీను…..
జీవో నెంబర్ 282 రద్దు చేయాలి÷ సిఐటియు మండల కార్యదర్శి వష పొంగు వీరన్న…….
తిరుమలాయపాలెం మండలంలో సార్వత్రిక సమ్మె విజయవంతం… మండల కేంద్రంలో జరిగిన సభలో అఖిలపక్ష నాయకుల పిలుపు……
తిరుమలయపాలెం జూలై 9 20 25….
హక్కులు సాధించుకోవాలంటే పోరాటాల తప్ప కార్మికులకు వేరే మార్గం లేదని, పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెల్లేనని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్(CITU) జిల్లా నాయకులు షేక్ బషీరుద్దీన్ కార్మికులకు పిలుపునిచ్చారు…
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా తిరుమలయపాలెం మండలంలో సమ్మెను విజయవంతం చేశారు. అనంతరం మండల కేంద్రంలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీ మండలంలోని ఎమ్మార్వో ఎండిఓ ఆఫీసులో మీదుగా సెంటర్ వరకు చేరుకున్న తర్వాత, ఖమ్మం బంగ్లా ప్రధాన రహదారిపై దాదాపు రెండు గంటలపాటు బెటాయించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి వశపొంగు వీరన్న అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న షేక్ బషీరుద్దీన్ మాట్లాడుతూ ఈ సార్వత్రిక సమ్మె దేశవ్యాప్తంగా విజయవంతమైనట్లు ఆయన తెలియజేశారు. అత్యంత ఉత్సాహభరితంగా కార్మికుల సమ్మెలో పాల్గొన్నారని, తమ హక్కుల కోసం పోరాటాలకు రావడానికి కార్మికుల సిద్ధమవుతున్నారని ఈ సమ్మె ద్వారా తెలుస్తుందని ఆయన అన్నారు. ఈ సమ్మె ముఖ్య డిమాండ్స్ నెరవేరేవరకు పోరాటాలు ఆగవని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇచ్చే పోరాటాల్లో కార్మికులు అందరూ పాల్గొని తమ హక్కుల సాధన కోసం కృషి చేయాలని ఆయన కార్మికులకు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా కెవిపిఎస్ డివిజన్ కార్యదర్శి కొమ్ము శ్రీను మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం రూ 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధిక ధరలను తగ్గించాలని పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని ఆయన సందర్భంగా ప్రభుత్వాలు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి వసపొంగు వీరన్న మాట్లాడుతూ కార్మికుల పనిగంటలు పెంచే దానికి తీసుకువచ్చిన జీవో నెంబర్ 282 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆనాడు చికాగొ నగరంలో పోరాటం తో ఎనిమిది గంటల పని వచ్చిందని ఇప్పుడు ప్రభుత్వాలు దానికి మార్చి మళ్ళీ 10 గంటల పనిని తీసుకొస్తున్నారని,ఇది కార్మికులకు సరైనది కాదని వెంటనే వెనక్కి తీసుకోపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించారు.
ఈ సార్వత్రిక సమ్మె కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు కమ్మ కోమటి నాగేశ్వరరావు, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు తిమ్మిడి హనుమంతరావు, సిపిఐ ఎంఎల్ మండల కార్యదర్శి గొర్రెపాటి రమేష్, ఐద్వా జిల్లా నాయకురాలు సుగుణమ్మ, ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షులు గాదే వరుణ్,పాల్గొని ఉపన్యాసం చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు షేక్ బషీర్, ఎన్ రాము, అంగన్వాడీలు సారిక,శ్వేత, మధ్యాహ్న భోజనం పద్మ, ఉపేంద్ర,ఉప్పమ్మ, ఆశాలు మోటమర్రి నాగేంద్ర, లతా, సైదమ్మ, గ్రామ దీపికలు మెట్టు స్వరూప రాణి, రాంబాయి బిల్డింగ్ వర్కర్స్ పల్లి రమేష్, కోడి లింగయ్య, హమాలీలు అశోక్, లింగయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కొలిచలం స్వామి నెరసుల వెంకటేష్, రైతు సంఘం నాయకులు తుళ్లూరు నాగేశ్వరరావు, లింగస్వామి, నాయకులు పప్పుల ప్రసాద్ పప్పులు ఉపేందర్ తో పాటుగా మరో 400 మంది పాల్గొన్నారు..